మోసపూరిత కూటమి పాలకుల తీరుపై రైతుల్లో ఆందోళన | - | Sakshi
Sakshi News home page

మోసపూరిత కూటమి పాలకుల తీరుపై రైతుల్లో ఆందోళన

Oct 23 2025 6:19 AM | Updated on Oct 23 2025 6:19 AM

మోసపూరిత కూటమి పాలకుల తీరుపై రైతుల్లో ఆందోళన

మోసపూరిత కూటమి పాలకుల తీరుపై రైతుల్లో ఆందోళన

మోసపూరిత కూటమి పాలకుల తీరుపై రైతుల్లో ఆందోళన సాక్షి ప్రతినిధి, గుంటూరు : ఈ ఏడాది గుంటూరు జిల్లాలో ఖరీఫ్‌లో 50 వేల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఏడాది 44 వేల టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారు. గుంటూరు జిల్లాలో నవంబర్‌ చివరి నుంచి సేకరణ ప్రారంభం అవుతుందని పౌరసరఫరాల సంస్థ అధికారులు చెబుతున్నారు. బుధవారం నుంచి మండలాలవారీగా ధాన్యం సేకరణపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. తొలివిడతలో దుగ్గిరాల, తెనాలి, మంగళగిరి ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ దీనిపై పౌరసరఫరాల సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోనె సంచులు, రవాణా వాహనాలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో గత ఏడాదిలా గోనెసంచులు అందుబాటులో లేకపోవడం, రవాణాలో ఆలస్యం, చెల్లింపుల్లో జాప్యం, నాణ్యతపై వివాదాలు వంటి అంశాలకు తావివ్వొద్దని ఆదేశించారు. ధాన్యం నాణ్యత పరీక్షలలో ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా కచ్చితంగా పరీక్షలు జరపాలన్నారు. ఆయా కేంద్రాల్లో స్వీకరించే ధాన్యం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడాలని సూచించారు. మాటలకే పరిమితమైన ప్రభుత్వం గత ఏడాది రైతుల వద్ద ఎంత ధాన్యం ఉంటే అంతా కొనుగోలు చేస్తామంటూ ముఖ్యమంత్రి, జిల్లాకే చెందిన పౌరసరఫరాల శాఖ మంత్రి చెప్పిన మాటలు నీటిమీద మూటలే అయ్యాయి. కేవలం 22 వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత ప్రభుత్వం చేతులెత్తేసింది. లక్ష్యానికి సుదూరంగా ఉన్నా ధాన్యం కొనుగోళ్లను అనధికారికంగా నిలిపివేశారు. జిల్లా వ్యాప్తంగా 156 కేంద్రాలు ఏర్పాటు చేసినా కొనుగోలు చేసింది కేవలం 22 వేల టన్నులే. 25 వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి అనుమతి ఉన్నా ఇంకా ముందుగానే కొనుగోళ్లను నిలిపివేశారు. జిల్లాలో చాలాచోట్ల ధాన్యం రైతుల వద్దే ఉండిపోయింది. రైతులు ఆందోళన చేస్తే ఏదో మొక్కుబడిగా కొంత మాత్రం కొనుగోలు చేసి ఊరుకున్నారు. గత ఏడాది జిల్లాలో 1.41 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. తుపాన్లు, భారీ వర్షాలు దెబ్బతీసినా చాలాచోట్ల అధిక దిగుబడులు వచ్చాయి. అయితే బయట మార్కెట్‌లో దళారులు, వ్యాపారులు, మిల్లర్లు కుమ్మకై ్క ధరను దారుణంగా పడేశారు. బస్తాకు గిట్టుబాటు ధర రూ. 1,740 ఉండగా కనీసం రూ.1,300కు కూడా కొనని పరిస్థితులు ఉన్నాయి.

వచ్చే నెలాఖరు నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు కూటమి ప్రభుత్వం హడావుడి గతేడాది గిట్టుబాటు ధర లేక అన్నదాతలు కుదేలు రైస్‌ మిల్లర్లు, దళారుల మాయాజాలంతో తీవ్రంగా నష్టపోయిన రైతులు ప్రస్తుత ఖరీఫ్‌లో 50 వేల టన్నుల సేకరణ లక్ష్యం గతేడాది కూడా లక్ష్యానికి ఆమడ దూరంలో ఆగిన సేకరణ ఈసారైనా తేరుకునే అవకాశం లభిస్తుందా అంటూ ఎదురుచూపులు

కుంటిసాకులతో మాయ

ఈ సీజన్‌లో అధిక వర్షాల వల్ల రెండుసార్లు పంటలు దెబ్బతిన్న రైతులు ఈ ఏడాదైనా ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి ధాన్యం కొనుగోలు చేస్తుందా.. అని ఎదురుచూస్తున్నారు. లేకపోతే గత ఏడాదిలానే మళ్లీ తమను నిలువునా ముంచుతుందా అనే ఆందోళన వారిలో వ్యక్తం అవుతోంది. ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పాలకులు చెబుతున్నా అడ్డగోలు కొర్రీలతో అన్నదాతలకు అన్నివిధాలా నష్టమే మిగులుతోంది. పాలకుల మనసు మారి ఇకనైనా తమకు మద్దతు ధర కల్పించాలని కోరుతున్నారు.

రైతుల్లో ఎక్కువ మంది కౌలు రైతులే ఉన్నారు. వీరందరకూ కౌలు చెల్లించడమే కాకుండా పంట పెట్టుబడులు పెట్టడంతో తీవ్రంగా నష్టపోయారు. అయితే తేమ శాతం పేరుతో, గోనె సంచులు సరిపడా లేవన్న సాకులతో ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కించింది. ధాన్యం కొనుగోలుకు కీలకమైన తేమశాతం చూసే టెక్నీషియన్లు అందుబాటులో లేకపోయినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. తేమ శాతం చూశాక, ధాన్యాన్ని గోతాలకు ఎత్తి సంబంధిత రైస్‌మిల్లుకు పంపాక, అక్కడ మరోసారి తేమశాతం చూసి తిప్పి పంపిన సందర్భాలు అనేకం రైతులకు ఎదురయ్యాయి. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రైతు పోరుబాట నిర్వహించినా, రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. కొన్నది తక్కువే అయినా డబ్బులు వెంటనే చెల్లించామని ప్రచారం చేసుకున్నారు. ఈ ఏడాదైనా రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందా ? లేదా? అనేది తేలాల్సి ఉంది. మరోవైపు జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌ తులసి ‘సాక్షి’తో మాట్లాడుతూ ఈ ఏడాది 50 వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని, దీనికి అన్ని ఏర్పాట్లు ముందుగానే చేస్తున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement