టెండర్లలో తిరకాసు | - | Sakshi
Sakshi News home page

టెండర్లలో తిరకాసు

Jun 28 2025 5:59 AM | Updated on Jun 28 2025 7:35 AM

టెండర

టెండర్లలో తిరకాసు

గుంటూరు
శనివారం శ్రీ 28 శ్రీ జూన్‌ శ్రీ 2025

సాగర్‌ నీటిమట్టం

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌

జలాశయ నీటిమట్టం శుక్రవారం 514.30 అడుగుల వద్ద ఉంది. ఇది 139.0872 టీఎంసీలకు సమానం.

అమ్మవారికి బోనాలు

పిడుగురాళ్ల: ఆషాఢ మాసం సందర్భంగా పట్టణంలోని భవానీనగర్‌లో గల శ్రీ కనకదుర్గ దేవస్థానంలో శుక్రవారం అమ్మవారికి మహిళలు బోనాలు సమర్పించారు.

ముగిసిన సదరం క్యాంప్‌

తెనాలి అర్బన్‌: వికలాంగుల ధ్రువపత్రాల పునఃపరిశీలనలో భాగంగా తెనాలి జిల్లా వైద్యశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సదరం క్యాంప్‌ శుక్రవారంతో ముగిసింది.

సాక్షి ప్రతినిధి, గుంటూరు: రూసా 2.0 కింద ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రూ. 10కోట్లతో హబ్‌ సెంటర్‌, రూ. 4 కోట్లతో ఎకామిడేషన్‌ బ్లాక్‌ ఫర్‌ ఎంప్లాయిబిలిటీ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ భవనం నిర్మాణాలకు టెండర్లు ఆహ్వానిస్తూ ఈ ఏడాది మే 2న విజయవాడకు చెందిన ఏపీఈడబ్ల్యూఐడీసీ (ఆంధ్రప్రదేశ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ వెల్ఫేర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌) వేర్వేరుగా ప్రకటనలు జారీ చేసింది. నిర్మాణ రంగంలో అపార అనుభవం, అన్ని అర్హతలు, ఆసక్తి ఉన్న సంస్థలు ఆన్‌లైన్‌లో టెండర్లు దాఖలు చేశాయి. రూ. 10కోట్లతో భవన నిర్మాణానికి ఏడు, రూ. 4 కోట్లతో నిర్మించే భవనానికి నాలుగు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. గడువు కూడా మే 30తో ముగిసింది.

ఒకే సంస్థ టెండర్‌ ఆమోదం

టెండర్లను వెంటనే తెరవాల్సి ఉన్నా 20 రోజుల వరకు ఏపీఈడబ్ల్యూఐడీసీ అధికారులు తాత్సారం చేశారు. తెరిచిన తర్వాత రూ. 10 కోట్ల వ్యయంతో నిర్మించే భవనానికి దాఖలు చేసిన ఆరు సంస్థల బిడ్లను తిరస్కరించారు. ఒక సంస్థకు మాత్రమే అర్హత ఉన్నట్లుగా పేర్కొన్నారు. రూ. 4 కోట్లతో నిర్మించే భవనానికి దాఖలైన నాలుగు బిడ్లలో మూడింటిని తిరస్కరించారు. ఒక బిడ్‌కు అర్హత ఉన్నట్లు తేల్చారు. విచిత్రమేమంటే రెండు భవనాల నిర్మాణానికి ఒకే సంస్థ దాఖలు చేసిన బిడ్‌కు అర్హత ఉన్నట్లుగా పొందు పరిచారు. మిగితా వారందరికీ అర్హత ఉన్నా ఎందుకు తిరస్కరించారనేది అం తుచిక్కని విషయం. ఈ అంశాన్ని బయటకు కూడా వెల్లడించడం లేదు. ఏపీఈడబ్ల్యూఐడీసీ చీఫ్‌ ఇంజనీర్‌ కూడా ఫోన్లు ఎత్తడం లేదని, ఒకవేళ ఎత్తినా విషయం అడగగానే కట్‌ చేస్తున్నట్లు కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. మంత్రి లోకేష్‌ ప్రాతినిధ్యం వహించే శాఖలో, ఆయన నియోజకవర్గంలో జరుగుతున్న పనుల టెండర్లలో అక్రమాలు జరగడం చర్చనీయాంశంగా మారింది.

విస్తుపోతున్న కాంట్రాక్టర్లు

రూ.10కోట్లతో నిర్మించే భవనాల కోసం జరిగే టెండర్ల ప్రక్రియలో సాధారణంగా అన్ని అర్హతలు, ప్రమాణాలు ఉన్న సంస్థలే బిడ్‌లు దాఖలు చేస్తాయి. ఒక వేళ పేర్కొన్న నిబంధనల ప్రకారం ప్రమాణాలు లేకపోతే ఒకటి, రెండు సంస్థలు తిరస్కారానికి గురవుతాయి. కానీ ఏడు సంస్థలు బిడ్లు దాఖలు చేస్తే ఆరు తిరస్కారానికి గురవ్వడంపై కాంట్రాక్టర్లు విస్తుపోతున్నారు. మరో భవన నిర్మాణానికి నాలుగు సంస్థలు బిడ్‌లు దాఖలు చేస్తే, మూడు తిరస్కారానికి గురవ్వడం నిర్మాణ రంగంలో నైపుణ్యం ఉన్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

7

న్యూస్‌రీల్‌

నచ్చిన వారికి కట్టబెట్టేందుకే..

తమకు నచ్చిన వారికి కట్టబెట్టేందుకే ఏపీఈడబ్ల్యూఐడీసీ అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమతో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తులకు చెందిన సంస్థలకే నిర్మాణ బాధ్యతలు అప్పగించాలనే ఉద్దేశంతో వ్యవహరిస్తున్నారని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. పేరుకు నిబంధనల, ప్రక్రియ ప్రకారం అంతా చేపట్టామని చెప్పుకునేందుకు టెండర్లు ఆహ్వానించారని విమర్శిస్తున్నారు. నిర్మాణ పనులకు టెండర్లు ఆహ్వానించిన ఏపీఈడబ్ల్యూఐడీసీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా ప్రభుత్వంగానీ, నిధులు వెచ్చిస్తున్న యూనివర్సిటీకి చెందిన ఇంజనీరింగ్‌ విభాగం, ఉన్నతాధికారులు చోద్యం చూడటం తగదని పేర్కొంటున్నారు. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు.

విద్యలకు నిలయమైన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పలు భవనాల నిర్మాణ పనులు చేపట్టేందుకు ఇటీవల పిలిచిన టెండర్ల వ్యహారంలో పెద్దఎత్తున గోల్‌మాల్‌ జరిగింది. సొమ్మొకరిది.. పెత్తనమొకరిది అన్నట్లుగా టెండర్లను పర్యవేక్షిస్తున్న ఏపీఈడబ్ల్యూఐడీసీ అధికారులు వ్యవహరించారు. అస్మదీయులుకు కోట్ల రూపాయల పనులను కట్టబెట్టేందుకు నిబంధనలను కాలరాశారు. నిర్మా ణ రంగంలో అపార అనుభవం, అన్ని అర్హతలున్న కాంట్రాక్టర్లను పక్కన బెట్టారు. యూనివర్సిటీ, ప్రభుత్వ నిధులతో చేపడుతున్న పనులపై ఏపీఈడబ్ల్యూఐడీసీ పెత్తనంపై కాంట్రాక్టర్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీని వెనుక పెద్దఎత్తున చేతులు తడిపినట్లు ఆరోపిస్తున్నారు.

ఏఎన్‌యూలో నిర్మాణ పనుల

టెండర్ల ప్రక్రియపై ఆరోపణలు

అన్ని అర్హతలూ ఉన్న కాంట్రాక్టర్ల

దరఖాస్తులు తిరస్కారం

నచ్చినవారికి కట్టబెట్టేందుకే నాటకం

కాంట్రాక్టర్ల మండిపాటు

చిన్నబాబు ఇలాకాలో ఇష్టారాజ్యం

ఏపీఈడబ్ల్యూఐడీసీ తీరుపై

తీవ్ర విమర్శలు

టెండర్లలో తిరకాసు1
1/6

టెండర్లలో తిరకాసు

టెండర్లలో తిరకాసు2
2/6

టెండర్లలో తిరకాసు

టెండర్లలో తిరకాసు3
3/6

టెండర్లలో తిరకాసు

టెండర్లలో తిరకాసు4
4/6

టెండర్లలో తిరకాసు

టెండర్లలో తిరకాసు5
5/6

టెండర్లలో తిరకాసు

టెండర్లలో తిరకాసు6
6/6

టెండర్లలో తిరకాసు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement