నీట్ ఫలితాల్లో శ్రీచైతన్య విజయకేతనం
గుంటూరు ఎడ్యుకేషన్ : నీట్–2025 ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థల విద్యార్థులు అఖిల భారతస్థాయిలో వివిధ కేటగిరీల్లో ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఈమని దుర్గాప్రసాద్ తెలిపారు. శనివారం గుంటూరులోని శ్రీచైతన్య క్యాంపస్‌లో జరిగిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో దుర్గాప్రసాద్ మాట్లాడుతూ గుంటూరు జోన్ నుంచి ఎం.అరవింద్ 13వ ర్యాంకు, జె. శ్రీ కీర్తన 109వ ర్యాంకు, ఎం.రోహన్ 133వ ర్యాంకు, షేక్ నిహాల్ పర్వేజ్ 180వ ర్యాంకు, జి. లక్ష్మీదివ్య శ్రీ 187వ ర్యాంకు, సీహెచ్ రీతికారెడ్డి 296వ ర్యాంకు, కె.సిరివెన్నెల 847వ ర్యాంకు, వి. లిదియా జాస్మిన్ పాల్ 976వ ర్యాంకుతో పాటు ఐదువేల లోపు 41 మంది, 10వేల లోపు 83 ర్యాంకులు సహా 195 మందికి పైగా విద్యార్థినీ, విద్యార్థులు మెడికల్ సీట్లు సాధించేందుకు అర్హత సాధించారని వివరించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను సంస్థ అకడమిక్ డైరెక్టర్ బొప్పన సుష్మ, ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఈమని దుర్గాప్రసాద్, డీన్స్ కిషోర్ కుమార్, చంద్రశేఖర్, కృష్ణ, అసోసియేట్ డీన్ హరిబాబు, ఏజీఎం ఎల్‌టీసీ శ్రీనివాస్, ఆయా క్యాంపస్‌ల ప్రిన్సిపాల్స్, అధ్యాకులు అభినందించారు.


