
భోజనానికి ఇబ్బంది పడ్డాం
ఎప్పుడో ఉదయాన్నే బయలుదేరాం. కాజ సమీపంలో ట్రాన్సిట్ పాయింట్ వద్ద భోజనం కోసం బస్సును ఆపారు. రాయలసీమ వారికి భోజనం వేరే ప్రాంతంలో ఏర్పాటు చేసినట్లు అప్పుడు చెప్పారు. సుమారు 25 మంది ఉండటంతో గంట తర్వాత భోజనం అందించారు.
– కె.పద్మజ, కమలాపురం, కడప జిల్లా
మా ప్రాంతం వారికి భోజన సదుపాయం ఇక్కడ కాదన్నారు. మీకు ఇస్తే మిగతా వాళ్లకి సరిపోవని, లెక్కప్రకారం భోజనాలు తీసుకొచ్చామని స్థానికంగా స్టాల్స్‌లో ఉన్న వారు చెప్పారు. తర్వాత ఓ అధికారి వద్దకు వెళ్లి అడగడంతో స్పందించారు.
– ఎం.జగన్, కడప జిల్లా
అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల దూర ప్రాంతాల ప్రజలందరూ ఇబ్బందులు పడ్డారు. మాకు బోయపాడు వద్ద భోజన సదుపాయం కల్పించామని చెప్పారు. కానీ అక్కడి నుంచే మేం వచ్చాం. ఒక్కరికి కూడా భోజనం అందలేదు. కాజ టోల్‌గేటు వద్ద వేరే బస్సులో అదనంగా ఉన్న భోజనం అందించారు.
– వెంకట రాము, ఆత్మకూరు,
అనంతపురం జిల్లా
అధికారుల మధ్య సమన్వయ లోపం

భోజనానికి ఇబ్బంది పడ్డాం