
రైల్వే ఎస్పీ తనిఖీ
లక్ష్మీపురం : ఇటీవల పహల్గాంలో ఉగ్రవాదుల దాడి, ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి విచ్చేస్తున్న సందర్భంగా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా గుంటూరు రైల్వే స్టేషన్‌లో గురువారం రైల్వే ఎస్పీ రాహూల్‌దేవ్ తనిఖీలు చేపట్టారు. గుంటూరు రైల్వే స్టేషన్‌లో జీఆర్పీ, ఆర్పీఎఫ్, ఐఆర్‌పీ సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ రాహూల్‌దేవ్ మాట్లాడుతూ ఉగ్రవాద దాడులు, నక్సల్స్ దాడులు జరుగుతున్న నేపథ్యంలో రైల్వే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తనిఖీల్లో ఎస్పీ వెంట రైల్వే డీఎస్పీ అక్కేశ్వరరావు, రైల్వే లైన్స్ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్, ఎస్సై ఎం.లక్ష్మీనారాయణ, యు.జ్యోతి, శ్రీనివాసరెడ్డి, సిబ్బంది తదితరులు ఉన్నారు.