దుగ్గిరాల ఎంపీపీగా షేక్‌ జబీన్‌ ఏకగ్రీవం | - | Sakshi
Sakshi News home page

దుగ్గిరాల ఎంపీపీగా షేక్‌ జబీన్‌ ఏకగ్రీవం

Mar 28 2025 2:07 AM | Updated on Mar 28 2025 2:01 AM

దుగ్గిరాల: స్థానిక మండల పరిషత్‌ అధ్యక్షుడి ఎన్నిక గురువారం సమావేశ మందిరంలో నిర్వహించారు. డ్వామా పీడీ శంకర్‌ ప్రిసైడింగ్‌ అధికారిగా వ్యవహరించారు. టీడీపీ చెందిన ఎంపీటీసీ సభ్యులు తొమ్మిది మంది, జనసేన సభ్యులు ఒకరు, కోఆప్షన్‌ సభ్యులు ఒకరు ఎన్నికలో పాల్గొన్నారు. వైఎస్సార్‌ సీపీ సభ్యులంతా గైర్హాజర్‌ అయ్యారు. ముందుగా సమావేశంలో కోరం సభ్యులు సరిపోగా ఎన్నిక ప్రారంభించారు. గొడవర్రు ఎంపీటీసీ శివకుమార్‌ లేచి జబీన్‌ను అధ్యక్షురాలిగా ప్రతిపాదించారు. దీన్ని మధుబాబు బలపరిచారు. ఒక్క నామినేషన్‌ మాత్రమే రావడంతో జబీన్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది. కార్యక్రమంలో ఎంపీడీవో ఎ.శ్రీనివాసరావు, తహసీల్దార్‌ ఐ.సునీత పాల్గొన్నారు. అల్లర్లు జరగకుండా పోలీసులు 144 సెక్షన్‌ అమలు చేశారు. ఎస్‌ఐ వెంకట రవి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

మంచికలపూడిలో ఉప సర్పంచిగా పులి కోటేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అఽధికారి కె.జె.నెహ్రూ తెలిపారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement