
చెక్కులు అందుకున్న లబ్ధిదారులతో మంత్రి అంబటి రాంబాబు
సత్తెనపల్లి: పేద ప్రజల సంక్షేమానికి, అనారోగ్యాలతో ఆర్థికంగా చితికిపోయిన వారికి భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ఆర్థిక భరోసా కల్పిస్తోందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పట్టణంలోని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం ఐదుగురు లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.8.45 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందరి సంక్షేమం కోసం పారదర్శకంగా పనిచేస్తోందని చెప్పారు. ఆరోగ్యశ్రీలో లేని వ్యాధులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ సాయం అందుతుందని పేర్కొన్నారు. విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ఈ ప్రభుత్వం ఆచరణాత్మక, సంస్కరణతో కూడిన పాలనను అందిస్తోందని వివరించారు. విలేజ్ క్లినిక్, కుటుంబ వైద్యుని విధానంతో ఇంటింటికీ వైద్యులు వెళ్లి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పారు. పేద ప్రజలకు, దారిద్య్రరేఖకు దిగువున ఉన్న వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు అచ్యుత శివప్రసాద్, స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ లాల్‌బాషా, నకరికల్లు మండల పరిషత్ ఉపాధ్యక్షుడు మేడం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి సహాయ నిధితో
ఆర్థిక భరోసా
రాష్ట్ర జలవనుల శాఖ మంత్రి
అంబటి రాంబాబు
ఐదుగురికి రూ.8.45 లక్షల
విలువైన చెక్కుల పంపిణీ