
గుంటూరు మెడికల్: మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫిమేల్‌కు మంగళవారం గుంటూరు డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో పునర్విభజన కౌన్సెలింగ్ నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ అమర్తలూరి శ్రావణ్‌బాబు అధ్యక్షతన నిర్వహించిన కౌన్సెలింగ్‌కు 91 మంది ఎంపీహెచ్‌ఏ అభ్యర్థులు హాజరు కాగా, 82 మందికి పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
‘ఇంటర్’వెల్
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సర పరీక్షలు మంగళవారం ముగిశాయి. కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ పేపర్–1 పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 134 కేంద్రాల పరిధిలో కేటాయించిన 50,053 మంది విద్యార్థుల్లో 48,619 మంది విద్యార్థులు హాజరయ్యారు. డీవీఈఓ జె.పద్మ గుంటూరులోని విద్వాన్ జూనియర్ కళాశాల పరీక్ష కేందం తనిఖీకి వెళ్లిన సమయంలో కాపీయింగ్‌కు పాల్పడిన ఒక విద్యార్థిని గుర్తించి, మాల్ ప్రాక్టీసు కేసు నమోదు చేయించారు. 68 పరీక్ష కేంద్రాల్లో అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.