గుంటూరు మెడికల్:బీజేపీ గుంటూరు జిల్లా మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అమ్మిశెట్టి ఆంజనేయులు (60) ఆదివారం సాయంత్రం గుండెపోటుతో మరణించారు. ఆయన అంత్యక్రియలు సోమవారం స్థానిక బొంగరాల బీడు శ్మశాన వాటికలో జరిగా యి. బీజేపీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి నూకల మధుకర్ జీ, సీనియర్ నాయకుడు జూపుడి రంగరాజు, పలు రాజకీయ పార్టీల నాయకులు, స్నేహితులు, బంధువులు, అభిమానులు అమ్మిశెట్టి ఆంజనేయు లు పార్థివదేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు.
సోము వీర్రాజు నివాళి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆదివారం రాత్రి గుంటూరులోని అమ్మిశెట్టి ఆంజనేయులు భౌతికాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆంజనేయులు అకాల మరణం పార్టీకి తీరని లోటని, బీజేపీకి ఎంతో సేవ చేశారన్నారు.