రూ. 1377.53 కోట్లతో గుంటూరు సమగ్రాభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

రూ. 1377.53 కోట్లతో గుంటూరు సమగ్రాభివృద్ధి

Mar 26 2023 2:06 AM | Updated on Mar 26 2023 2:06 AM

  బడ్జెట్‌ సమావేశంలో మేయర్‌ కావటి,  ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌  - Sakshi

బడ్జెట్‌ సమావేశంలో మేయర్‌ కావటి, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌

నెహ్రూనగర్‌ (గుంటూరు ఈస్ట్‌): నగర సమగ్రా భివృద్ధే ధ్యేయంగా నగరపాలక సంస్థ వార్షిక బడ్జెట్‌ శనివారం కౌన్సిల్‌ సభ్యులు ఆమోదించారు. రూ.1377.53 కోట్ల అంచనాలతో రూపొందించిన 2023–24 వార్షిక బడ్జెట్‌ నగర మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు అధ్యక్షతన సోమవారం నగర పాలక సంస్థ కాన్ఫరెన్స్‌ హాల్‌లో బడ్జెట్‌ సమావేశం జరిగింది.

ప్రధానంగా బడ్జెట్‌లో ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరు, ఇతర మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత కల్పించారు. బడ్జెట్‌లో సభ్యుల సూచించిన సూచనలు, కొన్ని మార్పులు చేర్పులతో బడ్జెట్‌ ఆమోదం తెలుపుతున్నట్లు నగర మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు చెప్పారు. ఈ సమావేశంలో నగర కమిషనర్‌ కీర్తి చేకూరి, డెప్యూటీ మేయర్‌ షేక్‌ సజీల, డెప్యూటీ కమిషనర్లు, ఇంజినీరింగ్‌ సూపరింటెండెంట్‌, సిటీ ప్లానర్‌, డెప్యూటీ సిటీ ప్లానర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.

నగరాభివృద్ధే ఏకై క ఎజెండా

నగరాభివృద్ధే తమ ఏకైక ఎజెండా అని నగర మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు పేర్కొన్నారు. బడ్జెట్‌లో ప్రజారోగ్యం, పారిశుద్ధ్యానికి, తాగునీటి సరఫరా, పార్కుల అభివృద్ధి, గ్రీనరీ, రోడ్లు, డ్రైన్లు అభివృద్ధి, రోడ్డు విస్తరణ పనులు చేయడం ద్వారా ట్రాఫిక్‌ సమస్య వంటి సమస్యలు తీరుతాయన్నా రు. నగర నడిబోడ్డులో పీవీకే నాయుడు మార్కెట్‌ రూ.80 కోట్లతో నిర్మించేందుకు బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయన్నారు. శ్మశానవాటికల అభివృద్ధికి, వాటి నిర్వహణకు రూ.5 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు.

వీధి కుక్కలను నియంత్రించాలి

నగరంలో వీధి కుక్కల బెడద రోజు రోజుకి పెరిగిపోతుండటంతో పాటు ప్రజలను గాయపరుస్తున్నాయని కార్పొరేటర్లు కౌన్సిల్‌ లెవనెత్తగా వీధి కుక్కలకు తగిన పరిష్కారం చూపాలని కోరారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌లు మాట్లాడుతూ నగరంలో స్కూల్‌ జోన్స్‌లో వీధి కుక్కల బెడద లేకుండా ప్రజారోగ్యధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

బాగా తగ్గిన వెహికల్‌ షెడ్‌ నిర్వహణ

నగరపాలక సంస్థ వెహికల్‌ షెడ్‌లో గత కొన్నేళ్లుగా భారీ స్థాయిలో అవకతవకలు జరుగుతున్నాయని...దీనికి సంబంధించి సరైన రికార్డులు కూడా మెయింటైన్‌ చేయడం లేదని గత కౌన్సిల్‌ సమావేశాల్లో డెప్యూటీ మేయర్‌ వనమా బాలవజ్రబాబు లెవనెత్తిన నేపథ్యంలో ప్రస్తుత బడ్జెట్‌లో కోట్లల్లో వ్యత్యాసం కనిపించింది.

25 ఈస్ట్‌ 09 :

కేటాయింపులు ఇవీ... రూ. కోట్లలో

పారిశుద్ధ్య నిర్వహణకు 54.30

వీధి కుక్కల నియంత్రణకు 2

వీధి దీపాల నిర్వహణకు 7

తాగునీటి సరఫరాకు 14.50

పార్కులకు,గ్రీనరీ 17

రోడ్లు 80

డ్రైన్లు 30

పీవీకే నాయుడు మార్కెట్‌ 80

రోడ్డు జంక్షన్లకు 5

ఆర్వోబీ, ఆర్‌యూబీలకు 10

శ్మశాన వాటిక నిర్వహణకు 5

స్టేడియం అభివృద్ధి రూ.50 లక్షలు

ప్రజారోగ్యం రూ.54 లక్షలు

బడ్జెట్‌ స్వరూపం ఇలా... రూ. కోట్లలో

ప్రారంభ నిల్వ 608,93,78,449

జమలు 768,59,73,850

మొత్తం 1337,53,52,299

ఖర్చులు 976,25,98,460

అంత్య నిల్వ 401,27,53,839

గుంటూరు నగర బడ్జెట్‌ రూపకల్పన

ప్రజారోగ్యానికి, తాగునీటికి, ఇతర

మౌలిక వసతులకు పెద్ద పీట

మార్పులు, చేర్పులతో బడ్జెట్‌

ఆమోదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement