Union Budget 2023-24: కార్పొరేట్ల బడ్జెట్‌

G Hara Gopal Comment on Union Budget 2023-24 - Sakshi

అభిప్రాయం  

ఇదే కాదు... కొన్నేళ్ళుగా బడ్జెట్‌ల స్వరూపాలను చూస్తే ఇవి బడుగులకు బాసటగా ఉంటున్నాయా? కార్పొరేట్లకు కొమ్ముగాస్తు న్నాయా అనే సందేహా లొస్తున్నాయి. ప్రజల భవి ష్యత్, మానవ ప్రమా ణాలు, జీవన అవసరాలు నెరవేరని బడ్జెట్‌ దేశాన్ని సంక్షోభంలోకి నెడుతుందనేది నిర్వివాదాంశం. సంపద సృష్టే లక్ష్యంగా దేశ బడ్జెట్‌ను ప్రవేశపెడితే దుష్ఫలితాలు తప్పవు.

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌  బడ్జెట్‌ ఈ వాదా నికి ఏమాత్రం తీసిపోదు. ఆదాయానికి అనుగు ణంగా పన్నులు వేయాల్సిందే. దాని ద్వారా వచ్చిన ఆదాయంతోనే ప్రజా సంక్షేమం సాధ్యం. ఇది జర గాలంటే సంపాదించే వర్గం నుంచే ఆదాయాన్ని రాబట్టాలి. కానీ నూతన ఆర్థిక విధానాల తర్వాత బడ్జెట్ల స్వరూపమే మారుతోంది. అవి కార్పొరేట్‌ రంగానికి ఊతమిచ్చేలా ఉంటున్నాయి.

ప్రత్యక్ష, పరోక్ష పన్నులను పరిశీలిస్తే 70 శాతం సంపదను గుప్పిట్లో పెట్టుకునే పది శాతం ఆదాయ వర్గాల నుంచి పన్ను రాబట్టడం లేదు. ఆదాయం తక్కువగా ఉండే 90 శాతం ప్రజలే పన్నుల భారాన్ని మోస్తున్నారు. రూ. 6 కోట్ల సంపద దాటినా 30 శాతమే పన్ను వేయడం ఏమిటి? ఇదే ప్రభుత్వాలు అనుసరిస్తున్న లాజిక్‌. ప్రత్యక్ష పన్నుల పేరుతో 90 శాతం తక్కువ సంపద ఉన్నవారి నుంచి పీడిస్తున్నారు. దేశ ద్రవ్యోల్బణం 3 శాతం దాటకూడదు. కానీ 6 శాతం ద్రవ్యోల్బణం ఉన్నట్టు కేంద్రం చెబుతోంది. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయడంలో ఏమాత్రం వెనకాడని ప్రభుత్వం, వాటి పరిరక్షణకు ఎక్కడా కేటాయింపులు చేయక పోవడం దుర్మార్గమే. జనాభాలో 60 శాతంగా ఉన్న రైతుల ఆదాయం కేవలం 11 శాతమే. అప్పుల భారంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అనేక రకాలుగా ఆందోళనలకు దిగుతున్నారు. ఈ రంగాన్ని కేంద్ర బడ్జెట్‌ విస్మరించడం దారుణం. డిజిటల్‌ టెక్నాలజీ తెస్తామనీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెస్తామనే భరోసాలు రైతన్న కళ్ల నీళ్లు తుడుస్తాయా? విద్యారంగంపై చేసే ఖర్చును పెట్టుబడిగానే చూడాలి. ఈ రంగంపై పెట్టుబడులు పెట్టబట్టే జపాన్‌, కొరియా వంటి దేశాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. కానీ మన బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపులు తగ్గించారు.

కోవిడ్‌ మనకు ఎన్నో అనుభవాలు నేర్పింది. వైద్య రంగాన్ని అతలాకుతలం చేసింది. అయినా పేదవాడి ప్రాణాలకు భరోసా ఇచ్చే రీతిలో కేటా యింపులు కన్పించడం లేదు. ప్రైవేట్‌ కాలేజీలు నర్సింగ్‌ కోర్సులు పెట్టుకునేందుకు ముందుకు రావడం లేదు. లాభాలు తక్కువగా వస్తున్నాయని వెనకడుగు వేస్తున్నాయి. కాబట్టే నర్సింగ్‌ కాలేజీ లకు నిధులు కేటాయించారు. కానీ అందరికీ వైద్యం అందించేందుకు తీసుకున్న చర్యలేమిటో, కేటాయించిన నిధులెంతో ప్రభుత్వం చెప్పలేదు. విద్య, వైద్యాన్ని విస్మరిస్తే పురోగతి ఎలా సాధ్య మవుతుంది? ఏదేమైనా ఈ బడ్జెట్‌ పేదలకు ఏ మాత్రం ప్రయోజనం చేసేది కాదు. కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగానే ఉంది. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు తిలోదకాలిచ్చిన నేపథ్యం తాజా బడ్జెట్‌ కూర్పులో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రభావం మున్ముందు అనేక దుష్ఫలితాలకు దారి తీస్తుంది.

జి. హరగోపాల్‌
వ్యాసకర్త సామాజిక, ఆర్థిక విశ్లేషకులు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top