
మన దేహంలో కొన్ని కీలకమైన గ్రంథుల్లో థైరాయిడ్ ఒకటి. ఇది టి3, టి4 అనే రెండు హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ గ్రంథి ముఖ్యంగా పిండం ఎదిగే సమయంలో కణాలు ఎదుగుదలకు, జీవక్రియల సమన్వయానికి దోహదపడుతుంది. అయితే ఈ గ్రంథి పనితీరు పెరిగినా, తగ్గినా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. దీని పనితీరు తగ్గితే దాన్ని హైపోథైరాయిడిజం అంటారు.
హైపోథైరాయిడిజం లక్షణాలు
- కండరాల నొప్పులు
- కండరాలు పట్టేయడం
- చర్మం పొడిగా మారడం
- బరువు పెరగడం
- గొంతు బొంగురుపోవడం
- ముఖం, కళ్లు వాయడం
- జుట్టురాలడం
- మలబద్ధకం
- శృంగారం పట్ల అనాసక్తత
- స్త్రీలకు రుతుసమయంలో సమస్యలు
- గుండె తక్కువగా కొట్టుకోవడం
- జ్ఞాపకశక్తి తగ్గడం వంటివి
తొలిదశలో గుర్తిస్తే.. జబ్బు ముదరకుండా నివారించవచ్చు. ఒకసారి రోగి నిర్ధారణ జరిగాక చికిత్స ఏమంత కష్టం కాదు. వ్యాధి తీవ్రతను బట్టి థైరాక్సిన్ మాత్రలు వాడాల్సి ఉంటుంది. చాలామందిలో ఇవి జీవితాంతం వాడాల్సిన అవసరం రావచ్చు.