టెక్సాస్‌ కొత్త అబార్షన్‌ చట్టానికి మహిళల నిరసన సెగ..!!

Thousands Of Women March For Abortion Rights In US Here Are Full Details - Sakshi

అబార్షన్‌ (గర్భస్రావం) పై ఆంక్షలను విధించడాన్ని నిరసిస్తూ అమెరికా దేశవ్యాప్తంగా వేలాది మహిళలు రోడ్డెక్కారు. చట్టప్రకారం తమకు దక్కవలసిన హక్కులను కొనసాగించాలని టెక్సాస్‌ నగర వీధుల్లో ప్లకార్డులతో నినదిస్తున్నారు. దీంతో 50 రాష్ట్రల్లో మహిళల నిరసనల సెగలు మిన్నంటాయి. గత నెలలో టెక్సాస్‌ రాజధాని ఆస్టిన్‌లో గవర్నర్‌ గ్రెగ్‌ అబాట్‌ సంతకం చేసిన ‘హార్ట్‌ బీట్‌’ చట్టాన్ని వందలాది మంది వ్యతిరేకిస్తున్నారు. అమల్లోకొచ్చిన ఈ చట్టం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఏమిటీ చట్టం?
టెక్సస్‌ కొత్త చట్టం ప్రకారం.. గర్భస్థ పిండం గుండె కొట్టుకోవడం ప్రారంభమైతే అబార్షన్‌ చేయించుకోవడం నిషేదం. సాధారణంగా గర్భంలో 6 వారాలకు పిండం గుండె కొట్టుకోవడం మొదలౌతుంది (చాలా మంది మహిళలు తాము గర్భవతులని తెలియక ముందే 85 నుంచి 95 శాతం ముందుగానే అబార్షన్లు అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు). అత్యచార బాధితులు, అక్రమ సంబంధం ద్వారా గర్భవతులైన వారికి కూడా ఈ చట్టం నుంచి ఎటువంటి మినహాయింపు లేదు.

అంతేకాకుండా ఈ నిషేధాన్ని అతిక్రమించి అబార్షన్‌కు పాల్పడినట్లు రుజువుచేసిన వారికి అక్కడి ప్రభుత్వం పది వేల డాలర్లు రివార్డు కూడా ప్రకటించింది. ఇది అత్యంత నిర్భందమైనదని, ఈ చట్లాన్ని రద్దు చేయాలంటూ అక్కడి మహిళలు ఆందోళనలు చేపట్టారు.

మిసిసిసీలో ఈ చట్టముంది
ఐతే వాషింగ్టన్ నిరసనకారులు రెండు రోజులు ముందుగానే యూఎస్‌ సుప్రీంకోర్టులో ఈ చట్టం రూపొందకుండా పిటిషన్‌ వేశారు. 1973లో రో వర్సెస్‌ వేడ్‌ మిసిసిసీ కేసులో ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ ఈ చట్టం రూపొందకుండా అడ్గుకునేందుకు ప్రయత్నించారు. ఈ మిసిసిసీ కేసులో 15 వారాల తరువాత మహిళలు అబార్షన్‌  చేయించుకోకూడదనే నిబంధన ఉంది.

సెప్టెంబర్‌ 1 నుంచి..
ఒక వేళ న్యాయస్థానం ముందుగానే ఈ చట్టాన్ని రద్దు చేయకపోతే ఎటువంటి ఆంక్షలు లేకుండా అమలుచేయడానికి రాజ్యంగ బద్ధంగా రాష్ట్రాలకు సర్వహక్కులు ఇవ్వబడతాయి. కాగా ఈ చట్టానికి వ్యతిరేకంగా వచ్చిన పిటీషన్లన్నింటినీ న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో సెప్టెంబర్‌ 1 నుంచి ఈ చట్టం అ‍మల్లోకొచ్చింది. ఐతే అనతి కాలంలోనే ఈ చట్టం వివాదాస్పదంగా మారింది. 

రెండోసారి..
కాగా 2017 మార్చిలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు మొదటి సారి ర్యాలీ చేపట్టారు. అదే స్థాయిలో ఇప్పుడు రెండో సారి నిరసనల గళం వినబడుతోందని ఉమెన్‌ మార్చ్‌ ఎక్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాచెల్‌ ఓ లియరీ కార్మొనా అన్నారు. 

చదవండి: కాలిఫోర్నియా బీచ్‌లో ముడిచమురు లీక్‌.. పర్యావరణానికి తీవ్ర నష్టం!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top