అవమానించిన వాళ్లే అభినందిస్తున్నారు!

Indian security guard daughter graduating from a prestigious UK university - Sakshi

వైరల్‌

‘నువ్వేమైనా కలెక్టర్‌వా? డాక్టర్‌వా? లేకపోతే ఏమైనా కంపెనీకి ఓనర్‌వా? ఆఫ్టరాల్‌... సెక్యూరిటీ గార్డ్‌వి. సెక్యూరిటీ గార్డు కూతురు విదేశాల్లో చదవగలదా?’ అని ఆ గార్డు ముఖం మీదే కరుకుగా మాట్లాడారు చాలామంది. బాధ పెట్టే కామెంట్స్‌ ఎన్ని చెవిన పడ్డా కూతురిని విదేశాల్లో చదివించాలనే లక్ష్యం విషయంలో ఆయన ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు.

కట్‌ చేస్తే... యూకే లో ఒక యూనివర్శిటీ నుంచి సెక్యూరిటీ గార్డ్‌ కూతురు ధనుశ్రీ గైక్వాడ్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. ధనుశ్రీని ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్‌ చేయడం, ఆమె తన గ్రాడ్యుయేషన్‌ డిగ్రీని స్వీకరించడానికి వేదికపైకి వెళ్లడం, గ్రాడ్యుయేషన్‌ క్యాప్, గౌన్‌ ధరించిన ధనుశ్రీ తండ్రిని ఆనందంగా ఆలింగనం చేసుకోవడంలాంటి దృశ్యాలు వీడియోలో కనిపిస్తాయి.

ఆయుష్మాన్‌ ఖురాన, ఈశా గుప్తాలాంటి బాలీవుడ్‌ సెలబ్రిటీలు కూడా ఈ వీడియోపై స్పందించారు. ‘నువ్వు గార్డువి మాత్రమే. నీ కూతురిని విదేశాల్లో చదివించడం అసాధ్యం’ అని తండ్రితో చెప్పిన ప్రతి ఒక్కరికీ వీడియోను షేర్‌ చేసింది ధనుశ్రీ గైక్వాడ్‌. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోకు 20 మిలియన్‌లకు పైగా వ్యూస్‌ వచ్చాయి.

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top