
విద్యార్థుల్లో మంచి ఆరోగ్య పద్ధతులను, పరిశుభ్రత అలవాట్లను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఇల్నెస్ టు ఫౌండేషన్ సహకారంతో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (PEFI) ‘స్వస్థ్ హాత్, స్వస్థ్ బచ్‌పన్’ (ఆరోగ్యకరమైన చేతులు, ఆరోగ్యకరమైన బాల్యం) అనే ప్రచారాన్ని ప్రారంబించింది. సుమారు వంద పాఠశాలలు కవర్ చేసేలా దాదాపు 40 వేల మంది విద్యార్థులను భాగస్వామ్యం అయ్యేలా చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
గతేడాది దాదాపు 35 పాఠశాలల్లో దగ్గర దగ్గర 30 వేల మందికి పైగా విద్యార్థులను విజయవంతంగా భాగస్వామ్యం అయ్యేలా చేసింది. ఈ ప్రచార కార్యక్రమం విద్యార్థులు ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడంలో సహాయపడటమే కాకుండా పాఠశాల వాతావరణం తోపాటు సమాజంలోని ప్రజారోగ్య అవగాహనను బలోపేతం చేస్తోంది.
ఈ వెల్‌నెస్ పద్ధతులను విద్యార్థులు జీవితాంత అనుసరించేలా చేయడం తోపాటు నిజమైన స్వస్థ్ భారత్ మార్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఈ ఇల్నెస్ టు వెల్నెస్ ఫౌండేషన్ సలహా మండలి చైర్‌పర్సన్ అనిల్ రాజ్‌పుత్ తెలిపారు. కేవలం సాంప్రదాయ ఉపన్యాసాలపై మాత్రమే ఆధారపడకుండా, వివిధ రకాల ఆకర్షణీయమైన, వినూత్న ఫార్మాట్‌ల ద్వారా హ్యాండ్‌వాషింగ్ టెక్నిక్‌లను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.

ఇక ఈ 'స్వస్థ్ హాత్, స్వస్థ్ బచ్‌పన్' ప్రచారం ప్రారంభ కార్యక్రమం సెప్టెంబర్ 6,2025న న్యూఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ - IIలోని బల్వంత్రాయ్ మెహతా విద్యా భవన్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తం 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారికి డబ్ల్యూహెచ్‌ఓ మార్గదర్శకాలకు అనుగుణమైన హ్యాండ్‌వాషింగ్ టెక్నిక్‌లపై నిపుణుల సలహాలతో కూడిన ఇంటరాక్టివ్ ప్రెజెంటేషన్‌ను అందించారు కూడా.
(చదవండి: Weight Loss Story: లైఫ్‌స్టైల్‌లో ఆ ఐదు మార్పులు తప్పనిసరి..! 59 కిలోలు తగ్గిన ఇన్‌ఫ్లుయెన్సర్)