ఫోడ్‌మ్యాప్‌ ఆహారం అంటే..? | Sakshi
Sakshi News home page

ఫోడ్‌మ్యాప్‌ ఆహారం అంటే..?

Published Tue, Mar 23 2021 12:50 PM

FODMAP Diet: What Foods Can you Eat on a Fodmap Diet - Sakshi

వాస్తవానికి ఫోడ్‌మ్యాప్‌ అంటే... ఫర్మెంటబుల్‌ ఆలిగోశాకరైడ్స్, డిసార్కరైడ్స్, మోనోశాకరైడ్స్‌ అండ్‌ పాలీయాల్స్‌ అనే రకరకాల ఆహారాలను సూచించే పదాల మొదటి అక్షరాలతో ఏర్పడిన సంక్షిప్త రూపమే ‘ఫోడ్‌మ్యాప్‌’. అయితే మనం సౌలభ్యం కోసం ఇక్కడ చెప్పినట్లు గుర్తుపెట్టుకుంటే చాలు. ఫోడ్‌మ్యాప్‌ ఆహారం అంటే... మనం తిన్న తర్వాత పేగుల్లో పూర్తిగా జీర్ణం కాకుండా కేవలం పాక్షికంగా మిగిలిపోయే ఆహారం అన్నమాట. ఇది అలా పాక్షికంగా జీర్ణమై మిగతాది మిగిలిపోవడంతో అది పులియడం మొదలవుతుంది. ఈ ప్రక్రియలో గ్యాస్‌ వెలువడటం, గ్యాస్‌ నిండి పొట్టబిగుతయ్యేలా చేయడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.

ఫోడ్‌మ్యాప్స్‌ ఎక్కువగా ఉండే ఆహారాలు మనం తినే ఆహారంలో కృత్రిమ చక్కెరలు, కొన్ని తీపిపదార్థాలు, పాలు, పండ్లలో మామిడి, ఆపిల్, కూరగాయల్లో బీట్‌రూట్, క్యాబేజీ, ఉల్లి వంటివాటిలో ఎక్కువ ఫోడ్‌మ్యాప్స్‌ ఉంటాయి. కాబట్టి వీటిని పరిమితంగానే తీసుకోవాలి. 

ఫోడ్‌మ్యాప్‌ తక్కువగా ఉండే ఆహారాలు  
అరటి, బ్లూబెర్రీ, ద్రాక్ష, నిమ్మ, ఆరెంజ్, స్ట్రాబెర్రీ వంటి వాటిల్లో ఫోడ్‌మ్యాప్స్‌ తక్కువగా ఉంటాయి. ఇలాగే గుమ్మడి, పాలకూర, టొమాటో, చిలగడదుంప (మోరంగడ్డ), కొత్తిమీర, అల్లం, ల్యాక్టోజ్‌ లేని పాలు, ఆలివ్‌ ఆయిల్, పెరుగు వంటి వాటిల్లోనూ ఫోడ్‌మ్యాప్‌ తక్కువ. వరి, ఓట్స్‌లో ఫోడ్‌ మ్యాప్స్‌ తక్కువ. ఫోడ్‌మ్యాప్‌ ఎక్కువగా ఉండే ఆహారం తింటే కడుపుబ్బరం, గ్యాస్‌పోవడం వంటి లక్షణాలతోపాటు ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి సాధ్యమైనంతవరకు ఫోడ్‌మ్యాప్‌ తక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటూ ఉండాలి.  

రోజంతా చురుగ్గా ఉండాలా..అయితే ఇది మీకోసమే!

Advertisement
Advertisement