ఉప్పుటేరు మార్జిన్‌కు ముప్పు | - | Sakshi
Sakshi News home page

ఉప్పుటేరు మార్జిన్‌కు ముప్పు

Apr 14 2026 7:40 AM | Updated on Apr 14 2026 7:40 AM

ఉప్పుటేరు మార్జిన్‌కు ముప్పు

భీమవరం అర్బన్‌: భీమవరం మండలంలోని లోసరి గ్రామంలో ఉప్పుటేరు డ్రైయిన్‌ ఆనుకుని మార్జిన్‌ను ఆక్రమార్కులు తవ్వేస్తున్నా.. డ్రైయినేజీ, మత్స్యశాఖ, రెవెన్యూ అధికారులు మాముళ్ల మత్తులో జోగుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత వారంలో ఈ మార్జిన్‌ తవ్వుతున్నారని సీపీఐ ఆధ్వర్యంలో వినతి పత్రాలు ఇచ్చినా ఇంతవరకూ ఆయా శాఖల అధికారులు కన్నెత్తి చూడలేదు. లోసరిలో ఉప్పు టేరు డ్రైయిన్‌కు పీడబ్ల్యూడీ మార్జిన్‌ సుమారు 500 మీటర్లకుపైగా ఉండటంతో కొంతమంది అక్రమార్కులు చేపలు, రొయ్యలు చెరువులు తవ్వడంతో డ్రెయిన్‌ కుచించుకుపోయింది. దీంతో వర్షాకాలంలో తుఫాన్‌లు, భారీ వర్షాలు వల్ల వచ్చే వరదనీరు గ్రామాలలోకి చేరి పంట పొలాలు, రొయ్య, చేపల చెరువులు ముంపుకు గురవుతున్నాయి. అవేమీ పట్టించుకోకుండా ఆక్రమార్కులు కిందిస్థాయి ఉద్యోగులకు మాముళ్లిచ్చి తమ పని కానిచ్చుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మాముళ్ల మత్తులో అధికారులు : డ్రెయినేజీ, రెవెన్యూ, మత్స్య శాఖ అధికారులు మాముళ్ల మత్తులో జోగుతున్నారన్న విమర్శలు వెల్లువెతున్నాయి. అధికారులు నిర్లక్ష్యం కారణంగా తీర ప్రాంతంలో పల్లపు గ్రామాల ప్రజలు, ఎగువన ఉన్న వరి, చేపలు, రొయ్యలు చెరువుల ముంపునకు గురవుతున్నాయి. అధికారులు స్పందించి వెంటనే ఉప్పుటేరు డ్రెయిన్‌ను ఆనుకుని పీడబ్ల్యూడీ మార్జిన్‌ను ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement