దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

దారుణ హత్య

Apr 14 2026 7:40 AM | Updated on Apr 14 2026 7:40 AM

దారుణ హత్య పీజీఆర్‌ఎస్‌లో 237 అర్జీల స్వీకరణ భూగర్భ జలాల పెంపే లక్ష్యం

తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలో సోమవారం గ్రామానికి చెందిన దెయ్యాల సూర్యనారాయణను నాయుడు అలియాస్‌ కిషోర్‌ హత్య చేశాడు. 8లో u

ఏలూరు (టూటౌన్‌): పీజీఆర్‌ఎస్‌ ద్వారా అందిన అర్జీల పరిష్కారం జవాబుదారీతనంతో ఉండాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికి అక్కడిక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ డా.ఎం.జె. అభిషేక్‌ గౌడ, ఇంచార్జ్‌ డీఆర్‌ఓ దేవకీదేవి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ ఎం.ముక్కంటి, సర్వే శాఖ ఏడీ అన్సారీలతో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అర్జీలకు సత్వర పరిష్కారం ప్రధానమన్నారు. సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. అర్జీదారుల నుంచి 237 దరఖాస్తులు స్వీకరించారు.

ఏలూరు (టూటౌన్‌): జిలాల్లో నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమం ద్వారా గ్రామాల నుంచి వచ్చిన పనుల ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో చేపట్టాల్సిన పనులపై సమీక్షించారు. పీజీఆర్‌ఎస్‌ అర్జీల పరిష్కారంలో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్‌ హెచ్చరించారు. గతంలో అర్జీ సమర్పించిన అర్జీదారులకు కలెక్టర్‌ ఫోన్‌ చేసి పరిష్కార విధానం, అధికారుల పనితీరును అడిగి తెలుసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement