అంబేడ్కర్‌ ఆలోచనా విధానం ఆదర్శనీయం | - | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ ఆలోచనా విధానం ఆదర్శనీయం

Apr 14 2026 7:40 AM | Updated on Apr 14 2026 7:40 AM

అంబేడ్కర్‌ ఆలోచనా విధానం ఆదర్శనీయం

పెంటపాడు: రాజ్యాంగ రూపకర్త అంబేడ్కర్‌ అలోచన విధానం నేడు ప్రపంచ దేశాలకు ఆదర్శమని శాసన మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు పేర్కొన్నారు. పెంటపాడు మండలం ముదునూరులో మాజీ సర్పంచ్‌ అద్దంకి పెద వెంకటరత్నం కుటుంబసభ్యులు నెలకొల్పిన భారీ అంబేడ్కర్‌ విగ్రహాన్ని మాజీ ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణతో కలిసి ఆయన ప్రారంబించారు. ఈ సందర్భంగా మోషేన్‌రాజు మాట్లాడుతూ.. ప్రపంచంలో పలు యూనివర్శిటీల్లో అంబేడ్కర్‌ విగ్రహాలను నెలకొల్పడం ఆయన గొప్పతనం చాటిచెబుతుందన్నారు. ఆయన రచనలు పలువురికి ఆదర్శంగా నిలిచాయన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయుడిగా అంబేడ్కర్‌ నిలిచారన్నారు. అద్దంకి పెదవెంకటరత్నం కుమారుడు విజయరత్నం, వారి కుటుంబసభ్యులను అభినందించారు.

శాసన మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు

Advertisement
 
Advertisement
Advertisement