ప్రాన్‌ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం | - | Sakshi
Sakshi News home page

ప్రాన్‌ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం

Apr 14 2026 7:40 AM | Updated on Apr 14 2026 7:40 AM

భీమవరం: ప్రాన్‌ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. సోమవారం భీమవరంలో నిర్వహించిన రొయ్యల రైతుల ప్రత్యేక సమావేశంలో నూతన కమిటీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా మళ్ల తులసీరామ్‌ (రాంబాబు), గాదిరాజు వెంకటసుబ్బరాజులను ఎన్నుకున్నారు. కోశాధికారిగా కె విజయ్‌, అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షుడిగా నంబూరి గజపతిరాజు, పొత్తూరి బాపిరాజు, ప్రత్యేక ఆహ్వానితునిగా వీరవల్లి చంద్రశేఖర్‌ మరో 45 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. రొయ్య రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని నూతన కార్యవర్గం తెలిపింది. సంఘ నాయకులు వి సత్యనారాయణ రాజు, భోగిరెడ్డి శ్రీనివాసరావు, రాయపరాజు, కాకర్ల వినయ్‌, వెంకట్రామయ్య, ముత్యాల బుజ్జి, తోట విజయకుమార్‌, భాస్కరరాజు, గుండా నర్సింహ రావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement