ప్రమాదంలో కాళ్లు, చేతులు తీవ్రంగా గాయపడడంతో కదలలేని స్థితిలో ఉంటున్నాను. చూసేవారు లేక ఇబ్బందులు పడుతున్నాను. ప్రభుత్వం పింఛను మంజూరు చేసి ఆదుకోవాలని కలెక్టర్‌కు అర్జీ పెట్టుకున్నాను.
– నల్లి అబ్రహం లింకన్,
చెరుకువాడ
నాకు బ్రెయిన్ స్టోక్ వచ్చింది. ఎటువంటి ఆధారం లేని నన్ను వృద్ధాప్యంలో ఉన్న తల్లి చూసుకుంటుంది. బతుకు దెరువు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. పింఛన్ మంజూరు చేసి ఆదుకొవాలని కలెక్టర్‌కు అర్జీ పెట్టుకున్నాను.
– కారుమంచి సీతమ్మ,
రేలంగి
సుగర్ వల్ల నా ఎడమ కాలు మోకాలి వరకు తొలగించారు. కుడికాలు కూడా దెబ్బతిని కదలలేని స్థితిలో ఉన్నాను. పింఛను కోసం కలెక్టర్‌కు అర్జీ పెట్టుకున్నాను. ప్రభుత్వం త్వరితగతిన పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలి.
– సానబోయిన సీతామహలక్ష్మి, మల్లిపూడి


