మాజీ సీఎం వైఎస్ జగన్‌కు వినూత్న రీతిలో శుభాకాంక్షలు
ఏలూరు (టూటౌన్): మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకుని ఏలూరుకు చెందిన సూక్ష్మ కళాకారుడు మేతర సురేష్‌బాబు తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలియజేశారు. సూది దారం గుచ్చే ప్రాంతంలోనూ, అగ్గిపుల్లపైనా వైఎస్ జగన్ చిత్రాలను రూపొందించారు. ఈ విధంగా తన అభిమాన నాయకుడికి శుభాకాంక్షలు తెలపడం పట్ల మైక్రో ఆర్టిస్ట్ సురేష్ బాబు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
గణపవరం: వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా గణపవరం మండలం పిప్పర గ్రామానికి చెందిన కాకర శ్యాంసుందర్ క్రెస్ట్‌సన్ నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర వైఎస్సార్ టీఏ అధ్యక్షుడు కె.జాలిరెడ్డి నియమాక ఉత్తర్వులు పంపారు. కేశవరం ఆదర్శ ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్న శ్యాంసుందర్ గతంలో వైఎస్సార్ టీఎఫ్ జిల్లా శాఖలో పనిచేశారు. శ్యాంసుందర్ నియామకం పట్ల జిల్లా వైఎస్సార్ టీఏ జిల్లా అధ్యక్షుడు మూరాల సుధాకర్, ప్రధాన కార్యదర్శి బొడ్డు రాంబాబు, గౌరవాధ్యక్షుడు రమేష్‌బాబు అభినందనలు తెలిపారు. తనను నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు జాలిరెడ్డికి శ్యాం సుందర్ కృతజ్ఞతలు తెలిపారు ఉపాధ్యాయుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తానని చెప్పారు.
ఏలూరు(మెట్రో): భూ సర్వేలు, భూ రికార్డులు, ఉప విభజనలు తదితర ప్రజాసేవలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడంలో ఆర్టీఐ చట్టం కీలక పాత్ర పోషించిందని డిస్ట్రిక్ట్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ షేక్ మహ్మద్ అన్సారీ అన్నారు. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ఏర్పడి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డిస్ట్రిక్ట్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ, ఏలూరు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించినట్లు చెప్పారు. గత రెండు దశాబ్దాలుగా ఈ చట్టం ద్వారా శాఖ కార్యకలాపాల్లో పారదర్శకత పెరిగి, ప్రజల నమ్మకం మరింత బలపడిందన్నారు. ఆర్టీఐ దరఖాస్తులను నిర్ధేశిత గడువులోగా పరిష్కరించాల్సిన అవసరం, చట్టంలోని నిబంధనల పట్ల అవగాహన, సెక్షన్–4 ప్రకారం ముందస్తు సమాచార ప్రకటన ప్రాధాన్యతపై అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించారు. అలాగే సరైన రికార్డు నిర్వహణతో పాటు డిజిటల్ వేదికల వినియోగం ద్వారా సేవల వేగం, పారదర్శకత పెంపుదలపై దృష్టి సారించాలన్నారు.
చాట్రాయి: మండలంలోని చిత్తపూరు జెడ్పీ హైస్కూలు విద్యార్థి ఎ.సంపత్‌కుమార్ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడు. 9వ తరగతి చదువుతున్న సంపత్ కుమార్ ఈ నెల 16, 17, 18 తేదీల్లో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన అండర్ 14 వాలీబాల్ పోటీల్లో సత్తా చాటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడని హెచ్‌ఎం జి సౌభాగ్యం తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని హెచ్‌ఎంతోపాటు పీఈటీ శివ నాగరాజు, ఉపాధ్యాయులు అభినందించారు.
అత్తిలి: మంచిలి గ్రామంలో డ్రెయినేజీ మురుగు నీరుపారుదల విషయమై ఏర్పడిన వివాదానికి సంబంధించి పరస్పరం చేసుకున్న ఫిర్యాదులకుగాను ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు అత్తిలి ఎస్సై పి.ప్రేమరాజు శనివారం తెలిపారు. మంచిలి గ్రామానికి చెందిన బొక్క ధనలక్ష్మి ఇంటి పక్కన గల మురుగు డ్రెయిన్ నుంచి నీరు ఎక్కువగా రావడంతో ఇంటి పక్కనున్న కౌరు వెంకటరమణ దౌర్జన్యం చేసిందని ధనలక్ష్మి ఫిర్యాదు చేసింది. ఇదే విషయంలో ధనలక్ష్మి తనపై దౌర్జన్యం చేసినట్లు కౌరు వెంకటరమణ ఫిర్యాదు చేసింది. దీంతో ఇరువురిపై తహసీల్దార్ కోర్టులో బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఎస్సై ప్రేమరాజు చెప్పారు. తహసీల్దార్ దశిక వంశీ ఇరువర్గాలను రప్పించి బైండోవర్ పత్రాలు రాయించుకున్నట్లు తెలిపారు.
సూది మొదలులో, అగ్గిపుల్లపై
వైఎస్ జగన్ చిత్రాన్ని రూపొందించిన దృశ్యం
మాజీ సీఎం వైఎస్ జగన్‌కు వినూత్న రీతిలో శుభాకాంక్షలు
మాజీ సీఎం వైఎస్ జగన్‌కు వినూత్న రీతిలో శుభాకాంక్షలు
మాజీ సీఎం వైఎస్ జగన్‌కు వినూత్న రీతిలో శుభాకాంక్షలు
మాజీ సీఎం వైఎస్ జగన్‌కు వినూత్న రీతిలో శుభాకాంక్షలు


