చర్చి నిర్మాణంపై న్యాయం చేయండి | - | Sakshi
Sakshi News home page

చర్చి నిర్మాణంపై న్యాయం చేయండి

Dec 21 2025 9:26 AM | Updated on Dec 21 2025 9:26 AM

చర్చి

చర్చి నిర్మాణంపై న్యాయం చేయండి

చర్చి నిర్మాణంపై న్యాయం చేయండి బంగారు గొలుసు బాధితురాలికి అప్పగింత

ఉండి: చర్చి నిర్మాణం కూల్చివేతపై పాస్టర్‌ దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. పాస్టర్‌ కొయ్యగర్ల దానియేలు దంపతులు తెలిపిన వివరాల ప్రకారం ఉండి శివారు రామాపురం, పాములపర్రు సరిహద్దులో 13 ఏళ్లగా సీయోను రారాజు ప్రార్థనా మందిరం ఉందని, సుమారు 70 మంది విశ్వాసులతో ప్రార్థనలు జరుపుకుంటున్నామని చెప్పారు. గతేడాది నవంబర్‌ 7న పాములపర్రుకు చెందిన కూటమి నాయకులు తమకు మాయమాటలు చెప్పి గ్రామాభివృద్ధి కోసం పక్కనే కాలువ కల్వర్టు నిర్మాణం చేయాలంటూ చెప్పి చర్చి కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో చర్చి తొలగించేందుకు అనుమతిస్తే రూ.50 వేలు ఇచ్చి, మరో ప్రాంతంలో 2 సెంట్లు భూమి ఇప్పించి, చర్చి నిర్మాణానికి సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కానీ చర్చి తొలగింపు అనంతరం వారేవరూ పత్తా లేకుండా పోయారని, కనీసం ఫోన్‌ చేసినా స్పందించేవారు కాదని వాపోయారు. క్రిస్మస్‌ పండుగ జరుపుకునేందుకు పాములపర్రు గ్రామ పెద్దలకు సమాచారం ఇచ్చి గతంలో చర్చి ఉండే పక్కనే ఖాళీస్థలంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి చిన్న చర్చి నిర్మాణం చేసుకుంటున్నట్లు చెప్పారు. అయితే శనివారం ఉండి పంచాయతీ అధికారులు, పోలీసులు, ఇరిగేషన్‌ సిబ్బంది చర్చి నిర్మాణాన్ని కూల్చివేశారని, తమకు న్యాయం చేయాలని కోరారు. ఇదే ప్రాంతంలో ఎన్నో ఆక్రమణలు ఉన్నా అధికారులు వాటివైపు కన్నెత్తి చూడకపోవడం కొసమెరుపు.

పోలీస్‌ వార్షిక క్రీడా సంబరాలు ప్రారంభం

ఏలూరు టౌన్‌: ఏలూరు జిల్లా పోలీస్‌ వార్షిక క్రీడా సంబరాలు ఉత్సాహంగా ప్రారంభం అయ్యాయి. ఏలూరు జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఎస్పీ కొమ్మి ప్రతాప్‌ శివకిషోర్‌ ఆకాశంలోకి రంగురంగుల బెలూన్లు ఎగురవేసి క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. నిత్యం పోలీస్‌ సిబ్బంది ప్రజలకు ఉత్తమ సేవలు అందించటంలో తీవ్ర ఒత్తిడితో విధులను నిర్వర్తిస్తూ ఉంటారని, ఇటువంటి క్రీడా సంబరాలు వారికి శారీరక దృడత్వంతోపాటు, మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఏఎస్పీ సుస్మిత ఉన్నారు. అనంతరం పోలీస్‌ అధికారులు, సిబ్బంది వివిధ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ సత్తా చాటుకున్నారు

ఏలూరు టౌన్‌: పోగొట్టుకున్న బంగారు గొలుసును బాధితురాలికి పోలీసులు అప్పగించారు. పోస్టల్‌ కాలనీకి చెందిన గోవాడ విజయలక్ష్మి తన బంగారు గొలుసును తాకట్టు పెట్టేందుకు ఏలూరు వన్‌టౌన్‌ ప్రాంతానికి వెళుతుండగా... హాయ్‌ హోటల్‌ సమీపంలో గొలుసు జారిపడిపోయింది. దీనిపై బాధితురాలు ఏలూరు వన్‌టౌన్‌ సీఐ జీ.సత్యనారాయణకు ఫిర్యాదు చేసింది. కోడేలు ప్రాంతానికి చెందిన అడ్డగార్ల లక్ష్మీ ఇందిర తనకు రోడ్డుపై దొరికిన బంగారు గొలుసుని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించడంతో వెంటనే డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌ ఆ బంగారు గొలుసును బాధితురాలు విజయలక్ష్మికి అందజేశారు.

చర్చి నిర్మాణంపై న్యాయం చేయండి 
1
1/1

చర్చి నిర్మాణంపై న్యాయం చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement