క్రాస్ కంట్రీ పోటీల్లో విద్యార్థి ప్రతిభ
కామవరపుకోట: రాష్ట్రస్థాయి స్థాయి క్రాస్ కంట్రీ పోటీలకు ద్వారకాతిరుమల మండలం రామసింగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని ఎంపికై నట్లు అథ్లెటిక్స్ జిల్లా అధ్యక్షులు జి.ప్రసాద్ తెలిపారు. శుక్రవారం కామవరపుకోటలో నిర్వహించిన జిల్లాస్థాయి క్రాస్ కంట్రీ పోటీల్లో రామసింగవరం పాఠశాల విద్యార్థులు సూదగాని హేమ సత్య విశేష ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు, సందీప్, ఆవల నిర్మల పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందుకున్నట్లు ఆయన తెలిపారు. వీరు ఈనెల 24న తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో జరగబోయే రాష్ట్రస్థాయి క్రాస్ కంట్రీ పోటీల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు. వీరికి శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు నార్ని నాగవసంతరావును హెచ్‌ఎం ఆలూరి వెంకటరత్నం, సీనియర్ అథ్లెటిక్స్ మల్ల రాజు అభినందించారు.
తాడేపల్లిగూడెం రూరల్: పెదతాడేపల్లి జాతీయ రహదారిపై కమ్మ కల్యాణ మండపం సమీపంలో శుక్రవారం ఏలూరు వైపు నుంచి తణుకు వైపు రోడ్డు దాటుతున్న గొర్రెలను పాలవ్యాను ఢీకొంది. దీంతో 15 గొర్రెలు మృతి చెందగా, 15 గొర్రెలు గాయాలపాలయ్యాయి. ఈ గొర్రెలను పెదతాడేపల్లి మేకల సంతకు తీసుకువస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని కాపలాదారుడు సూర్యనాగు వాపోయాడు.
క్రాస్ కంట్రీ పోటీల్లో విద్యార్థి ప్రతిభ


