పార్క్‌ చేసిన కారుకు మంటలు | - | Sakshi
Sakshi News home page

పార్క్‌ చేసిన కారుకు మంటలు

Dec 12 2025 6:36 AM | Updated on Dec 12 2025 6:36 AM

పార్క

పార్క్‌ చేసిన కారుకు మంటలు

పార్క్‌ చేసిన కారుకు మంటలు ముంపు ప్రాంతాల్లో చెట్ల వేలం వృద్ధురాలిపై లైంగిక దాడికి యత్నం పందెం పుంజుల చోరీ

చింతలపూడి: పార్క్‌ చేసిన కారు నుంచి మంటలు చెలరేగిన ఘటన చింతలపూడి మోడల్‌ కాలనీలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం మోడల్‌ కాలనీలో రోడ్డు పక్కన గత కొంతకాలంగా పార్కు చేసి ఉంచిన కారుకు మంటలు అంటుకున్నాయి. కారు ఉన్న ప్రదేశంలో చుట్టూ చెట్లు ముళ్ళ కంపలు పెరిగి ఉన్నాయి. పారిశుద్ధ్య సిబ్బంది వాటిని తొలగించి మంట పెట్టడంతో మంటలు కారుకు అంటుకుని ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ఏలూరు (టూటౌన్‌): ఏలూరు అటవీ అభివృద్ధి సమాఖ్య సమావేశం చైర్మన్‌, ముఖ్య అటవీ సంరక్షణాధికారి బీఎన్‌ఎన్‌ మూర్తి అధ్యక్షతన జిల్లా అటవీశాఖ అధికారి కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ఉన్న విలువైన చెట్లను నరుకుటకు, వేలం వేసేందుకు, సదరు వేలం వేయగావచ్చిన ఆదాయం నుంచి 50 శాతం సొమ్ము వన సంరక్షణ సమితులకు ఇచ్చేందుకు, 50 శాతం సొమ్ము ప్లాంటేషన్‌ పెంచేందుకు తీర్మానం చేశారు. కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖాధికారి పీవీ సందీప్‌ రెడ్డి, అటవీశాఖ సిబ్బంది, వన సంరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు.

నరసాపురం రూరల్‌: మండలంలోని పేరుపాలెం సౌత్‌ గ్రామంలో కొబ్బరితోటలో ఈనులు చీరుకుంటున్న వృద్ధురాలిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి యత్నించిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు గురువారం మధ్యాహ్న సమయంలో గ్రామంలోని కొబ్బరితోటలో ఈనులు తీసుకుంటుండగా ఆ ప్రాంతంలో సంచరిస్తున్న గుబ్బల పెద్దిరాజు (30) అనే వ్యక్తి ఆమె మూతికొరకడంతో పాటు శరీరం, వంటిపై గాయాలు చేసి లైంగికదాడికి యత్నించాడు. వృద్ధురాలు కేకలు వేయడంతో స్థానికులు వచ్చి పెద్దిరాజును పోలీసులకు అప్పగించారు. బాధితురాలిని వైద్యం నిమిత్తం నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు. ఆమె నుంచి మొగల్తూరు ఎస్సై నాగలక్ష్మి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై విలేకరులకు తెలిపారు.

ఉంగుటూరు: మండలంలోని గొల్లగూడెం పంచాయతీ పరిధిలో తిమ్మయ్యపాలెంలో కోర్లేపర్ల శ్రీను అనే వ్యక్తికి చెందిన పందెం కోళ్ల పెంపకం స్థావరంలో గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం రాత్రి పందెం చోరీ చేశారు. కోళ్ల పెంపకం ప్రాంతం వద్ద ఉన్న కాపలాదారుడిని బెదిరించి సుమారు 45 కోళ్లను పట్టుకుపోయారు. వీటి విలువ సుమారు రూ.6 లక్షలు వరకు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం పై చేబ్రోలు ఎస్సై సూర్యభగవానుని ప్రశ్నించగా సుమారు 12 కోళ్లు మాత్రమే పోయాయని,కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

పారిజాతగిరిలో

ధనుర్మాస ఉత్సవాలు

జంగారెడ్డిగూడెం: గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానంలో డిసెంబర్‌ 16వ తేదీ నుంచి 2026 సంవత్సరం జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస మహోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వహణ అధికారి కలగర శ్రీనివాస్‌ తెలిపారు. ఈ సందర్భంగా ధనుర్మాసంలో అనేక విశేష కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్‌ 30వ తేదీ మంగళవారం ఉదయం 5 గంటల నుంచి వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం, 2026 జనవరి 8వ తేదీ గురువారం ఉదయం 6.30 గంటలకు దీపోత్సవం, జనవరి 11వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు కూడా మహోత్సవం, విశేష ప్రసాద నివేదన, జనవరి 14వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు గోదా కల్యాణం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

పార్క్‌ చేసిన కారుకు మంటలు 1
1/2

పార్క్‌ చేసిన కారుకు మంటలు

పార్క్‌ చేసిన కారుకు మంటలు 2
2/2

పార్క్‌ చేసిన కారుకు మంటలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement