జీసీసీ డిపోల్లో అమ్మకాలు పెరగాలి
బుట్టాయగూడెం: జీసీసీ సేల్స్ డిపోల్లో ఏడాదికి ఇచ్చిన టార్గెట్‌ను సేల్స్‌మెన్లు మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఐటీడీఏ పీఓ కె.రాములు నాయక్ అన్నారు. మండలంలోని కేఆర్‌పురం జీసీసీ కార్యాలయాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా జీసీసీ పరిధిలో ఉన్న 26 మంది సేల్స్‌మెన్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పీఓ మాట్లాడుతూ అటవీప్రాంతంలో గిరిజనులు సేకరించిన ఉత్పత్తులను తప్పనిసరిగా కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. నిత్యవసర సరుకులు, గిరిజన ఉత్పత్తుల అమ్మకాలను కూడా పెంచాలని ఆదేశించారు. జీసీసీ సీనియర్ మేనేజర్ చెరు కూరి రాజయోగి మాట్లాడుతూ జీసీసీ తయారు చేసిన ఉత్పత్తులకు సంబంధించి కొత్త రకం స్టిక్కర్లతో కూడిన ప్యాకింగ్‌తో విక్రయాలు నిర్వహిస్తామని, ప్రజలు గమనించాలని కోరారు.


