ప్రభుత్వ నిర్ణయం మార్చుకోవాల్సిందే
పేదలకు వైద్య విద్యను దూరం చేసే ప్రభుత్వ నిర్ణయం మార్చుకునే వరకూ ఉద్యమం ఆగదు. మా నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కష్టపడి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వైద్య కళాశాలలను తీసుకు వచ్చారు. ప్రైవేటు పరం చేస్తామంటే ఊరుకోం.
– బండారు గోపి, చింతలపూడి
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంపై వైఎస్సార్‌సీపీ కోటి సంతకాల సేకరణతో ప్రభుత్వానికి సెగ తగిలింది. ప్రభుత్వం దిగిరాక తప్పదు. గ్రామగ్రామాన ప్రజలు పెద్ద ఎత్తున కోటి సంతకాలు సేకరణలో పాల్గొన్నారు.
– రఘు సర్పంచ్, చాటపర్రు, దెందులూరు మండలం
ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడమంటే పేద వర్గాల పిల్లలకు వైద్య విద్యను దూరం చేయడమే. స్తోమత ఉన్నవారే వైద్య విద్యను చదవగలగుతారు. ప్రజల ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం అత్యంత దారుణం.
– పల్లెపాం సూర్య, చింతలవల్లి, ముసునూరు మండలం
ప్రభుత్వ నిర్ణయం మార్చుకోవాల్సిందే
ప్రభుత్వ నిర్ణయం మార్చుకోవాల్సిందే


