నేరాలకు పాల్పడితే కఠిన చర్యలే
నిందితులను రోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు..
ఏలూరు టౌన్: యువతిపై అత్యాచార నిందితులను జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ ఆదేశాలతో డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్ పర్యవేక్షణలో టూ టౌన్ సీఐ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో ఎస్సై మధువెంకట రాజా నడిరోడ్డుపై నడిపించుకుంటూ కోర్టుకు తీసుకువెళ్లడం నగరంలో చర్చనీయాంశంగా మారింది. ఏలూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్ నుంచి ఫైర్‌స్టేషన్, కోర్టు సెంటర్ మీదుగా జిల్లా కోర్టు ప్రాంగణం వరకూ నిందితులు ముగ్గురినీ పోలీస్ బందోబస్తుతో తీసుకువెళ్లి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. నగరంలో సస్పెక్ట్ షీట్ నిందితుడు ఈనెల 4న అర్ధరాత్రి ఓ యువతి ఇంట్లోకి వెళ్లి ఆమెను సమీపంలోని వార్డు సచివాలయానికి లాక్కెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ కేసులో నిందితులు పులిగడ్డ జగదీష్‌బాబు, లావేటి భవానీకుమార్, వీరికి సహకరించిన కొత్తపేటకు చెందిన ఆకేటి ధనుష్‌ను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశా రు. అనంతరం ఏలూరులో న్యాయస్థానం ము ందు హాజరుపరిచారు. నగరంలో రౌడీయిజానికి, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదనీ, చట్టం మేరకు కఠిన చర్యలు తప్పవని పోలీస్ అధికారులు హెచ్చరిస్తున్నారు.


