విద్యుదాఘాతంతో ట్రాక్టర్ డ్రైవర్ మృతి
బుట్టాయగూడెం: పొలంలో ట్రాక్టర్‌తో దుక్కుదున్నుతున్న డ్రైవర్‌కు విద్యుత్ వైర్లు తగిలి మృతి చెందిన ఘటన మండలంలోని కొమ్ముగూడెంలో మంగళవారం జరిగింది. ఏఎస్సై సోమరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురంనకు చెందిన అయినం దుర్గారావు (64) వ్యవసాయ కూలీ. బుట్టాయగూడెం మండలం కొమ్ముగూడెంకు చెందిన రైతు నిమ్మగడ్డ సత్యనారాయణ వద్ద దుర్గారావు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం పొలం పని చేస్తుండగా తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ వైర్లు ట్రాక్టర్‌కు తగలడంతో డ్రైవర్ దుర్గారావు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని దుర్గారావు మృతదేహం వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై చెప్పారు.


