కౌలు రైతు విలవిల
న్యూస్‌రీల్
కౌలు రైతులకు భరోసా ఏదీ ?
యూరియాను బ్లాక్‌లో కొన్నా
కొల్లేరు వాసుల్లో పాముల భయం
కొల్లేరు వాసుల్లో పాముల భయం నెలకొంది. కై కలూరు నియోజకవర్గంలో ఈ ఏడాది ఇంతవరకూ 188 పాము కాటు కేసులు నమోదయ్యాయి. 10లో u
బుధవారం శ్రీ 5 శ్రీ నవంబర్ శ్రీ 2025
సాక్షి ప్రతినిధి, ఏలూరు: అన్నదాత సుఖీభవ లేదు.. పెట్టుబడి సాయ ఇవ్వరు.. ఇన్‌పుట్ సబ్సిడీకి అనర్హుడు.. కొద్దొ గొప్పొ వచ్చే బీమా కూడా ఎత్తేశారు. జిల్లాలో కౌలు రైతు పరిస్థితి ఇది. క్షేత్రస్థాయిలో 80 శాతానికి పైగా సాగు చేసేది కౌలు రైతులు. జిల్లాలో లక్షల ఎకరాల భూమిని సాగుచేసే కౌలు రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సీజన్‌లో ధరలు బాగుంటాయనే ఆశతో అధిక వడ్డీలకు అప్పులు తేవడం, పంటలు సాగు చేయడం, కోతల సమయానికి తుపాన్‌తో నష్టపోవడం ప్రతి ఏటా నిత్యకృత్యంగా మారి వేలాది మందిని ఆర్థికంగా కుంగదీస్తుంది. కూటమి ప్రభుత్వం కౌలురైతులను పూర్తిగా ఆదుకుంటామని ఎన్నికల సమయంలో పదేపదే హామీ ఇచ్చి 18 నెలల పాలనలో విస్మరించారు. పర్యవసానంగా అప్పులతో పంట సాగు చేసే కౌలురైతులు ఏటా ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్ధితులు జిల్లాలో కొనసాగుతూనే ఉన్నాయి.
రాష్ట్రంలోనే అత్యధికంగా కౌలు రైతులున్నది ఏలూరు జిల్లాలోనే. జిల్లాలో 4,77,500 ఎకరాల సాగు విస్తీర్ణంలో 1,95,875 ఎకరాల్లో వరి, అపరాలు, పత్తి పంటలు సాగులో ఉండగా మిగిలిన 2,72,939 ఎకరాల్లో పామాయిల్, కోకో సహా ఉద్యానవన పంటలు సాగులో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 5 లక్షల మంది రైతులుండగా అత్యధికంగా 2 లక్షలకుపైగా కౌలు రైతులే ఉండి 70 శాతం పైగా సాగు చేస్తున్నారు. కౌలు రైతుకు గుర్తింపు కార్డు మొదలుకొని ఎలాంటి అధికారిక సేవలు అందకపోవడంతో ఏటా నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. గతంలో పామాయిల్, కోకో, పొగాకు ధరలు పెరగడంతో ఆ మూడు పంటల కౌలు ధరలు భారీగా పెరిగాయి. సీజన్ అనుకూలిస్తే తెచ్చిన అప్పు తీర్చే పరిస్థితి ఉంటుంది. గడిచిన 18 నెలల్లో జిల్లాలో ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోవడం ఇది మూడవ సారి. తుపాను, గోదావరి వరదలు దాటికి పంట నష్టం వాటిల్లితే ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తామని ప్రకటించినా.. గత 18 నెలల్లో ఒక్కసారి ఇచ్చిన దాఖలాలు లేవు.
గుర్తింపు కార్డుల కోసం పోరుబాట
కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పోరుబాట కొనసాగుతూనే ఉంది. తరుచూ ప్రజాసమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్, ఇతర అధికారులకు కౌలు రైతులు వినతిపత్రాలు ఇస్తూనే ఉన్నారు. భూ యజమాని అంగీకారంతో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులు ఇప్పిస్తామని, బ్యాంకు రుణాలు ఇస్తామని, క్రాప్‌లోన్, ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా ఇస్తామని ప్రకటించి పూర్తిగా విస్మరించారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి మరో అడుగు ముందుకేసి మరణించిన కౌలురైతు కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. ఏ ఒక్కటీ అమలు చేయకపోవడంతో పరిస్ధితి ఆగమ్య గోచరంగా మారింది. తాజాగా మోంథా తుఫాన్‌ధాటికి 23 వేలకుపైగా పంట నష్టం వాటిల్లితే దానిలో 80 శాతానికిపైగా సాగుదారులు కౌలు రైతులు. ఈ క్రమంలో ప్రభుత్వం ఇచ్చే పరిహారం కూడా భూ యజమానులకే తప్ప కౌలు రైతులకు అందని పరిస్ధితి. వెబ్‌ల్యాండ్ నమోదు ఆధారంగా పంట నష్టాన్ని నమోదు చేసుకుని వారికే పరిహారం ఇవ్వనున్నారు. ఈ క్రమంలో వెబ్‌ల్యాండ్‌లో పూర్తిగా భూయజమానుల పేర్లే కాని కౌలురైతుల పేర్లు లేకపోవడం గమనార్హం.
తుపాను వల్ల నష్టపోయిన కౌలు రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యం. పంటను పరిశీలించేందుకు ఏ అధికారీ రాలేదు. నేలకొరిగిన, పొట్ట దశలో దెబ్బతిన్న పంట వల్ల దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పెట్టుబడి ఖర్చులు వచ్చేలా లేదు. ఐదు ఎకరాల వరి కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాను. రూ.1.5 లక్షల అప్పు చేసి పెట్టుబడి పెట్టాను. తుపాను వల్ల పంట పడగా, వర్షం వల్ల పంట తాలు గింజలు ఏర్పడ్డాయి. పెట్టుబడులు కూడా వస్తాయన్న ఆశా లేదు. కౌలు రైతులకు భరోసా వస్తుందన్న నమ్మకం లేదు.
– పెట్ల ఇశ్రాయేలు, కౌలు రైతు, ఎంఎం పురం, భీమడోలు మండలం
కౌలు రైతులను ఆదుకుంటామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. సార్వాలో గతంలో కన్నా ఈ ఏడాది పురుగుమందులు, వ్యవసాయ కూలీలకు ఖర్చులు పెరిగాయి. దీంతో పాటు బ్లాక్ మార్కెట్‌లో యూరియాను కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. 10 ఏకరాల భూమిని కౌలుకు తీసుకుని పీఎల్ పంటను సాగు చేస్తున్నాను. ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా నష్టపోయిన పంటను చూడడానికి రాలేదు. ఎకరాకు రూ.40 వేల వరకు ఖర్చు చేసాను. వర్షం వల్ల తాలు గింజలయ్యాయి. దిగుబడులు సగానికి తగ్గిపోతాయి.
– పెద్దిరెడ్డి భోగయ్య, కౌలు రైతు, ఎంఎం పురం, భీమడోలు మండలం
పెట్టుబడి సాయం నుంచి ఏ పథకమూఅందని వైనం
కౌలు రైతులను ఆదుకుంటామని ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వ ప్రకటన
18 నెలలు దాటినా కనీసం పట్టించుకోని వైనం
మోంథా తుపానుతో మరింత నష్టం
జిల్లాలో 2 లక్షల మందికిపైగా కౌలు రైతులు
కౌలు రైతు విలవిల
కౌలు రైతు విలవిల
కౌలు రైతు విలవిల


