జీతాల కోసం ఎదురు చూపులు | - | Sakshi
Sakshi News home page

జీతాల కోసం ఎదురు చూపులు

Nov 5 2025 7:39 AM | Updated on Nov 5 2025 7:39 AM

జీతాల

జీతాల కోసం ఎదురు చూపులు

శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.22 కోట్లు

ఉద్యోగులంటే అలుసా

ఇంతవరకూ జీతాలు లేవు

శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.22 కోట్లు

ఏలూరు (మెట్రో): ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు పాల బిల్లు దగ్గర నుంచి ఇంటి అద్దెలు, ఇలా అన్నీ ఖర్చులే.. ఆ రోజు జీతం కోసం ప్రభుత్వ ఉద్యోగి కోసం ఎదురు చూస్తుంటాడు. ప్రస్తుత కూటమి సర్కారులో మాత్రం ఒకటో తేదీన జీతాలు పడడం కలగా మారింది. ఈ నెల ఇంతవరకూ జీతాలు జమ చేయకపోవడంతో ఉద్యోగులు ఇక్కట్లు పడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 67 వేలకు పైగా ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉన్నారు. ఏలూరు జిల్లాలో 38 వేలు, పశ్చిమగోదావరి జిల్లాలో 29 వేల మంది విధులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20 వేలకు పైగా పెన్షనర్లు ఉన్నారు. వీరితో పాటుగా 15 వేల మంది అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, 17 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం వీరికి జీతాలు చెల్లించడంలో మాత్రం తాత్సారం చేస్తుంది.

ఒక్కొక్కరికి ఒక్కో తేదీన..

ఒకటో తేదీన జీతాలు చెల్లింపు ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వక్ర భాష్యం చెబుతోంది. అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు, న్యాయశాఖ ఉద్యోగులకు, పెన్షనర్లకు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి 3న జీతాలు చెల్లింపు చేసింది. అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం 4వ తేదీ రాత్రి వరకూ కూడా జీతాలు చెల్లింపులు చేయలేదు. ఒక్కోశాఖకు ఒక్కో తేదీన చెల్లింపులు చేయడం ఏంటో అర్ధం కావడం లేదు. బిల్లులు మంజూరు చేసే ట్రెజరీ శాఖలో 4వ తేదీ నాటికీ జీతాలు చెల్లింపులు జరగలేదు. ప్రతి ఉద్యోగి గంటగంటకూ బ్యాంకు బ్యాలెన్స్‌లు చెక్‌ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఒకటో తేదీ నాటికి జీతాలు జమ చేస్తే ఉద్యోగులు తమ నెలవారీ అప్పులు తీర్చుకుని కొత్తగా నెలను ప్రారంభిస్తారు. నవంబరు నెలలో ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి సర్కారు నిర్వాకంతో ఇది కష్టసాధ్యంగా మారింది.

గత వారం తీవ్ర ప్రయాసలు ఎదుర్కొంటూ మోంథా తుఫాను విధుల్లో ఉద్యోగులు నిమగ్నమయ్యారు. కొన్ని సందర్భాల్లో ఉద్యోగులు తమ సొంత సొమ్ములు ఖర్చు చేశారు. మోంథా తుపానును సమర్ధంగా ఎదుర్కొన్నప్పటికీ కేవలం ప్రశంసలతోనే కూటమి సర్కారు సరిపెట్టింది. ప్రస్తుత నెల జీతాల చెల్లింపులో తీవ్ర జాప్యం చేసింది. దీనిపట్ల ఉద్యోగులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే డీఎల చెల్లింపుల్లో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న సర్కారు, కోట్లాది రూపాయలు వివిధ బకాయిలు ఉద్యోగులకు చెల్లించాల్సి ఉన్నప్పటికీ తీవ్ర నిర్లక్ష్య ధోరణిని కూటమి సర్కారు ప్రదర్శిస్తుంది. ప్రతి నెలా ఒకటో తేదీన చెల్లించాల్సిన జీతాలు చెల్లింపులో ఎందుకు తాత్సారం చేస్తుందని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ హుండీల నగదు లెక్కింపు స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో మంగళవారం అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ జరిగింది. ఈ లెక్కింపులో శ్రీవారికి విశేష ఆదాయం సమకూరింది. గత 41 రోజులకు నగదు రూపేణా స్వామివారికి రూ.4,22,31,799 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ ఎన్‌వీ సత్యనారాయణమూర్తి తెలిపారు. కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 569 గ్రాముల బంగారం, 7.708 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. అదేవిధంగా లెక్కింపులోకి రాని రదైన పాత రూ. 2000, రూ. 1,000, రూ. 500 ల నోట్లు ద్వారా రూ. 41 వేలు వచ్చినట్టు చెప్పారు.

ఇంతవరకూ ఉద్యోగుల ఖాతాల్లో జమకాని వైనం

గంట గంటకూ బ్యాంకు బ్యాలెన్స్‌ చూసుకుంటున్న ఉద్యోగులు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 35 వేల మంది ఎదురుచూపులు

ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లింపులు చేయాల్సి ఉన్నప్పటికీ నేటికీ ప్రభుత్వం జీతం చెల్లించడంలో తీవ్ర నిరక్ష్యం ప్రదర్శిస్తుంది. ఎన్ని సమస్యల్లో ఉన్నప్పటికీ జీతాలు చెల్లించకపోవడం దారుణం. ఒకటో తేదీన జీతాలు రాకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.

– ఆర్‌ఎస్‌ హరనాథ్‌, పీఎఒ రాష్ట్ర అధ్యక్షుడు

నవంబరు నెల 4వ తేదీ వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించపోవడం దారుణం. ఒకటో తేదీ కోసం ప్రభుత్వ ఉద్యోగి నెల అంతా ఎదురు చూస్తూ ఉంటాడు. పాలు, అద్దెలు, కిరాణా వంటి ప్రతి ఒక్కటీ ఒకటో తేదీతోనే ముడిపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒకటో తేదీన జీతాలు చెల్లించకపోవడం చూస్తుంటే ప్రభుత్వానికి ఉద్యోగులపట్ల ఎంత చిత్తశుద్ది ఉందో అర్ధం చేసుకోవచ్చు.

– కె.రమేష్‌కుమార్‌,

జిల్లా రెవెన్యూ అసోసియేషన్‌ అధ్యక్షుడు

జీతాల కోసం ఎదురు చూపులు 1
1/3

జీతాల కోసం ఎదురు చూపులు

జీతాల కోసం ఎదురు చూపులు 2
2/3

జీతాల కోసం ఎదురు చూపులు

జీతాల కోసం ఎదురు చూపులు 3
3/3

జీతాల కోసం ఎదురు చూపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement