‘వందే భారత్’ రాక ఎప్పుడో?
చైన్నె–విజయవాడ వందేభారత్ రైలును నరసాపురం వరకూ పొడిస్తామని కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ చెప్పి నెల రోజులు గడిచినా ఇంతవరకూ పురోగతి లేదు 10లో u
ఏలూరు(మెట్రో): కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా పరిశ్రమలు, ఏగుమతులు ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగు యూనిట్లు ఎక్కువగా స్థాపించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత పెంచి గిరిజన కుటుంబాల్లో వెలుగులు నింపాలన్నారు. ఐటీడీఏ గిరిజన ఉత్పత్తులు నాణ్యతను మరింత పెంచి, అందమైన ప్యాకింగులు, మార్కెటు సౌకర్యం కల్పించి గిరిజనులకు అధిక లాభాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు నిమిత్తం భూములు గుర్తించామని చెప్పారు. సింగిల్ విండో పథకం ద్వారా త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని, మంజూరు చేసిన ప్రతి యూనిట్ ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ నెలలో 435 అనుమతులు మంజూరు గాక, పెండింగ్‌లో ఉన్న 39 అనుమతులు వీలైనంత త్వరగా మంజూరు చేయాలని కలెక్టరు ఆదేశించారు. ప్రైవేటు పెట్టుబడిదారులను ఆహ్వానించి ప్రభుత్వం నుంచి వారికి కావలసిన సౌకర్యాలు, సహాయం అందించడం కోసం వారితో ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమీక్ష సమావేశంలో జేసీ అభిషేక్ గౌడ, పరిశ్రమల కేంద్ర జీఎం పి.సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఏపీఐఐసీ జోనల్ మేనేజరు కె.బాబ్జీ, పరిశ్రమలు తనిఖీ అధికారి కె.కృష్ణమూర్తి, డీఆర్డీఏ పీడీ ఆర్.విజయరాజు, స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి జితేంద్రబాబు, తదితరులు పాల్గొన్నారు.


