పేదల కల జగన్‌తోనే సాధ్యం
ముదినేపల్లి రూరల్: డాక్టర్ కావాలనే పేద విద్యార్థుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు వైఎస్సార్‌సీపీ పాలనలో ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేశారని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) అన్నారు. మండలంలోని శ్రీహరిపురం శివారు చేవూరుపాలెం, సింగరాయపాలెం గ్రామాల్లో కోటి సంతకాల సేకరణ ప్రజాఉద్యమం–రచ్చబండ కార్యక్రమాన్ని పార్టీ మండల శాఖ అధ్యక్షుడు బోయిన రామరాజు, ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద విద్యార్థులకు మేలు చేసేందుకు ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి 17 మెడికల్ కళాశాలలకు అనుమతులు సాధించి నిర్మాణాలు చేపడితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుతో వీటిని ప్రైవేటు పరం చేస్తుందని విమర్శించారు. దీనివల్ల పేదలకు వైద్య విద్యను అభ్యసించే అవకాశాన్ని కోల్పోవడంతో పాటు పేద ప్రజలకు వైద్యం ఖరీదుగా మారుతుందన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కోమటి విష్ణువర్ధన్, రాష్ట్ర మహిళా కార్యదర్శి గంటా సంధ్య, జిల్లా అధికార ప్రతినిధి మోట్రు ఏసుబాబు, సాంస్కృతిక విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు రంగిశెట్టి నరసింహారావు(కొండా), జిల్లా బూత్ కమిటీ కార్యదర్శి మంగినేని బాబ్జి, నాయకులు పంజా నాగు, రాచూరి మోహన్, సాక్షి సాయిబాబు, అచ్యుత రాంబాబు, శింగనపల్లి రామకృష్ణ, మీగడ సూర్యచ్రందరావు, పరసా శ్రీను, ఏసు రాజు, వాసే జయరాజు, శొంఠిరాము, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


