ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు
ఏలూరు(మెట్రో): జిల్లాలో ధాన్యం కొనుగోలుకు పటిష్ట ఏ ర్పాట్లు చేయాలని జేసీ ఎంజే అభిషేక్‌గౌడ అ న్నారు. కలెక్టరేట్‌లో సో మవారం ధాన్యం కొనుగోలుపై అధికారులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, లారీ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 108 రైసు మిల్లులు, 234 రైతుసేవా కేంద్రాల్లో 85 లక్షలు గోనే సంచులు సిద్ధం చేశా మని, వచ్చేవారం నుంచి కొనుగోలు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. 4.50 లక్షల టన్ను ల ధాన్యం సేకరణ లక్ష్యమన్నారు. రైసు మి ల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మాట్లాడుతూ లారీ యజమానులతో మాట్లాడి ధాన్యం సకాలంలో రవాణా అయ్యేలా చూడాలన్నారు. గత రబీ సీజన్‌తో జీపీఎస్ సమస్యలతో కొన్ని లారీలకు రవాణా చార్జీలు చెల్లించలేదని, వాటికి చెల్లింపులు చేయాలని కోరారు. లారీ ట్రాన్స్‌పోర్టు ప్రతినిధులు మాట్లాడుతూ పెండింగ్ బిల్లులు చెల్లించాలని, అలాగే ఇప్పుడు రవాణా బిల్లులు కూడా సజావుగా చెల్లించాలని కోరారు. డిప్యూటీ కలెక్టర్ ఎల్.దేవకీదేవి, సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ పి.శివరామమూర్తి, డీఎస్‌ఓ ఈబీ విలియమ్స్, డీసీఓ ఆరిమిల్లి శ్రీనివాసు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్‌వీఎస్ ప్రసాదరావు పాల్గొన్నారు.


