ద్వారకాతిరుమల: మండలంలోని తిమ్మాపురంలో కొందరు గురు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి పలువురు రైతులకు చెందిన వ్యవసాయ భూముల్లోని మోటారు కేబుళ్లను తస్కరించారు. దాంతో బాధిత రైతులు సోమవారం పోలీసులను ఆశ్రయించారు. గ్రామానికి చెందిన సుమారు 10 మంది రైతులకు చెందిన పొలాల్లోని 500 మీటర్ల వైరును దొంగలు కట్‌చేసి, అపహరించారు. దాదాపు రూ.లక్ష మేర నష్టం వాటిల్లింది. తరచూ జరుగుతున్న ఈ వైర్ల దొంగతనాల కారణంగా బోర్ల కింద సాగవుతున్న కోకో, కొబ్బరి, వరి, పామాయిల్ తదితర పంటలకు తీవ్ర సష్టం వాటిల్లుతోందని బాధిత రైతులు కొయ్యలమూడి రామ్మోహన్‌రావు, ఏవీవీ కృష్ణారావు, బోళ్ల సత్యన్నారాయణ, కె.ప్రభాకరరావు. కె.నరసింహరావులు ఆవేదన వ్యక్తం చేశారు. దేవినేనివారిగూడెంలో గతేడాది జులై నెలలో సుమారు 15 మంది రైతులకు చెందిన పొలాల్లోని మోటారు వైర్లు ఇదే తరహాలో చోరీకి గురైనట్టు పలువురు రైతులు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ద్వారకాతిరుమల: కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటతో దేవదాయ శాఖ మేల్కొంది. ఆలయాలకు విచ్చేసే భక్తుల రక్షణకు దేవస్థానం అధికారులు, సిబ్బంది చేపట్టాల్సిన చర్యలపై ఆ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ సోమవారం మెమో జారీ చేశారు. కార్తీక మాసంలో ఆది, సోమవారాలు, పౌర్ణమి, ఏకాదశి, ఇతర పర్వదినాల్లో ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి సూచనలు ఇవ్వాలనే విషయాలను మెమోలో పేర్కొన్నారు. ఈ చర్యలు భక్తుల రద్దీ నియంత్రణ, భద్రత కోసం అత్యవసరమైనవని, అందువల్ల రాష్ట్రంలోని 6ఎ, 6బి దేవాలయాల ఈఓలు, దేవదాయ శాఖ అధికారులు, జోనల్ డిప్యూటీ కమిషనర్లు, రీజనల్ జాయింట్ కమిషనర్లు సూచనలను తక్షణమే అమలు చేయాలన్నారు.
● వందేళ్ల బామ్మ.. వెరీ స్ట్రాంగ్


