డాక్టర్ వెంపటాపునకు కళా గౌరవ్ సమ్మాన్
తణుకు అర్బన్: మన సంస్కృతి పేరిట విజయవాడ ఆర్ట్ అసోసియేషన్ గిల్డ్ బాలోత్సవ్ భవన్‌లో ఈ నెల 2న నిర్వహించిన చిత్రకళా ప్రదర్శనలో తణుకు చెందిన ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ వెంపటాపు శ్రీనమో అంతర్ముఖ్ఙి శీర్షికతో చిత్ర రచన చేసి అభినందనలు అందుకున్నారు. జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందుకున్నట్లు చెప్పారు. ఉత్తరప్రదేశ్ బరేలీకి చెందిన కళా రత్నం ఫౌండేషన్ ఆఫ్ ఆర్ట్ సొసైటీ ఇటీవల నిర్వహించిన ఇంటర్నేషనల్ ఆన్‌లైన్ ఆర్ట్ కాంపిటేషన్‌లో వెంపటాపు శ్రీకళా గౌరవ్ సమ్మాన్ఙ్ అవార్డును అందుకున్నట్లు చెప్పారు.
నూజివీడు: రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీల నిర్వహణకు ఏడాదికి రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్జీయూకేటీ వీసీ ఆచార్య ఎం.విజయ్‌కుమార్ తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ల్యాప్‌టాప్‌ల కొనుగోలు కోసం టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. మెస్‌ల నిర్వహణ హరేకృష్ణ మూమెంట్ సంస్థకు అప్పగించామని.. గతంలో మాదిరిగా విద్యార్థుల అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. నిర్వహణ సరిగా లేకపోతే జరిమానాలు విధిస్తామని చెప్పారు. హౌస్ కీపింగ్, సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించిన టెండర్లను త్వరలో ఖరారు చేస్తామన్నారు. నాలుగు ట్రిపుల్ ఐటీలకు డైరెక్టర్లు, ఆర్జీయూకేటీ వీసీ నియామకాలకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతోందని తెలిపారు.
బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలం రమణక్కపేట సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెం మండలం చల్లవారిగూడెంలోని కొయిదా ఆర్‌అండ్‌ఆర్ కాలనీకి చెందిన కాకాని రవి (35) జీలుగుమిల్లి నుంచి ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. రమణక్కపేట జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని ఢీకొట్టాడు. రవి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న జీలుగుమిల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.


