
ౖవెద్య విద్య ప్రైవేటుపై జనాగ్రహం
న్యూస్‌రీల్
జగన్‌తోనే మెడికల్ కాలేజీ సాకారం
పేదలకు వైద్య విద్యను దూరం చేసేందుకు..
ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘చలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ’ కార్యక్రమంతో కూటమి నేతల్లో గుబులు మొదలైంది. ఏలూరులో ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కుటిల యత్నాలు చేశారు. ఏలూరు పాత బస్టాండ్ ప్రాంతంలో పోలీస్ అధికారులు యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. మెడికల్ కాలేజీకి వెళ్లే అన్ని మార్గాలను మూసేశారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పార్టీ యువజన, విద్యార్థి విభాగం నేతలకు పోలీసులకు మధ్య కొద్దిసేపు తోపులాట చోటుచేసుకుంది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు గళమెత్తారు.
శనివారం శ్రీ 20 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
ఏలూరు టౌన్ : వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నాయకులు పార్టీ యువజన, విద్యార్థి విభాగం నేతలు, భారీ ఎత్తున కార్యకర్తలతో శుక్రవారం ఉదయం పాదయాత్రగా ఏలూరు పాతబస్టాండ్ వద్దగల మెడికల్ కాలేజీ వద్దకు బయలుదేరారు. జిల్లా నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు తరలివచ్చారు. అయితే పోలీసులు నిరసన తెలిపేందుకు కుదరదంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు, పార్టీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. కేసులు పెడతామంటూ పోలీసు లు బెదిరించారు. పోలీసులు అడ్డుకోవడంతో పార్టీ శ్రేణులు రోడ్డుపైనే బైఠాయించారు. ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం.. దోపిడి రా జ్యం.. అంటూ నినాదాలు చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే అణచివేత ధోరణితో వ్యవహరించడం మంచిది కాదంటూ ప్రజలు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు, పార్టీ నేతలు మాట్లాడారు.
వైద్య విద్యను దూరం చేసే కుట్ర
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో పేద, మద్యతరగతి వర్గాలకు వైద్య విద్యను దూరం చేసే కుట్రలో భాగంగానే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అమ్ముకుంటున్నారని విమర్శించారు. బాబు కు టుంబ సభ్యులకు ధారాదత్తం చేసేందుకు పీపీపీ విధానాన్ని తెచ్చారనీ, నీచమైన కుట్రలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు చరిత్రలో ఏనాడైనా ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారేమో చెప్పాలని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రానికి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతులు తెస్తే ఇప్పుడు చంద్రబాబు అమ్ముకోవాలని చూడటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్‌బాబు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, జిల్లా అధికార ప్రతినిధి మున్నల జాన్‌గురునాథ్, రాష్ట్ర కార్యదర్శి దాసరి రమేష్, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, జిల్లా ఉపాధ్యక్షురాలు చిలకపాటి డింపుల్, నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, జెడ్పీటీసీలు నిట్టా లీలానవకాంతం, కడిమి రమేష్, కాశీ విశ్వనాథ్ ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు ఇనపనూరి జగదీష్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పాతినవలస రాజేష్, క్రిస్టియన్ సెల్ నగర అధ్యక్షులు గ్జేవియర్ మాస్టర్, యువజన విభాగం నగర అధ్యక్షులు ఘంటా సాయిప్రదీప్, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మోహన్ తదితరులు పాల్గొన్నారు.
నిరసన తెలుపుతూ మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు
పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించిన నాయకులు
కూటమి కుట్రలపై కన్నెర్ర
పేదలకు వైద్య విద్యను దూరం చేసేందుకు కుయుక్తులు
ఏలూరులో గళమెత్తిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు
‘చలో మెడికల్ కాలేజీ’కి పోటెత్తిన జనం
అడుగడుగునా పోలీస్ ఆంక్షలు
రోడ్డుపై బైఠాయించి ఆందోళన
ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగైదు నెలల వ్యవధిలోనే ఏలూరు జీజీహెచ్‌లో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. కళాశాల నిర్మాణానికి రూ.525 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారని తెలిపారు. తొలి దశలో పాతబస్టాండ్ సెంటర్ ప్రాంతంలో రూ.60 కోట్లతో మెడికల్ కాలేజీ భవనాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించారని చెప్పారు. అయితే కూటమి నేతలు తామే కట్టామని చెప్పుకోవటం విడ్డూరంగా ఉందన్నారు.
చింతలపూడి సమన్వయకర్త కంభం విజయరాజు మాట్లాడుతూ పేదలు ఉన్నత విద్య అభ్యసించడం సీఎం చంద్రబాబుకు ససేమిరా నచ్చదనీ, పేదలంతా ఎప్పుడూ తక్కువగానే ఉండాలనే ఆలోచనతో పనిచేయటం బాబుకు పరిపాటే అన్నారు. సుమారు 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కనీసం తన హయాంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ తీసుకువచ్చారా ? అని ప్రశ్నించారు.

ౖవెద్య విద్య ప్రైవేటుపై జనాగ్రహం

ౖవెద్య విద్య ప్రైవేటుపై జనాగ్రహం

ౖవెద్య విద్య ప్రైవేటుపై జనాగ్రహం

ౖవెద్య విద్య ప్రైవేటుపై జనాగ్రహం