యాజమాన్య పద్ధతులు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

యాజమాన్య పద్ధతులు పాటించాలి

Sep 13 2025 5:57 AM | Updated on Sep 13 2025 5:57 AM

యాజమాన్య పద్ధతులు పాటించాలి

యాజమాన్య పద్ధతులు పాటించాలి

యాజమాన్య పద్ధతులు పాటించాలి ఇద్దరు పిల్లలు సహా తల్లి అదృశ్యం 9 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం క్షీరారామలింగేశ్వరస్వామి ట్రస్ట్‌ బోర్డు నియామకం

పోలవరం రూరల్‌: యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా వరిలో ఆశించే ఎండాకు తెగులు, ఉల్లికోడు, ఆకునల్లి తెగుళ్లను నివారించవచ్చని ఏలూరు జిల్లా ఏరువాక కేంద్రం జిల్లా కోఆర్డినేటర్‌ డాక్టర్‌ కె.ఫణి కుమార్‌ అన్నారు. గూటాల, కొత్త పట్టిసీమ రైతులకు వరి పొలంలో ఆశించే ఎండాకు తెగులు, ఉల్లికోడు, ఆకు నల్లిపై రైతులకు అవగాహన కార్యక్రమం గూటాలలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరిలో ఆశించే ఎండాకు తెగులు నత్రజని ఎరువులు అధికంగా వాడడం వల్ల, వాతావరణ పరిస్థితులు వల్ల ఆశిస్తుందన్నారు. నత్రజని ఎరువులు వాడకాన్ని తక్కువ మోతాదులో వాడటం– పోటాష్‌ ఎరువును అధిక మోతాదులో వాడుకుంటే ఈ ఎండాకు తెగులు కొంతవరకు అరికట్టవచ్చన్నారు. మురికి నీటిని ఎప్పటికప్పుడు తీస్తూ కాలువలో ఉన్న నీరుని ఎప్పటికప్పుడు చేల్లో పెట్టుకుంటూ ఉండాలన్నారు. ఎండాకు తెగులు ఆశించిన పొలాల్లో కాప్రాక్సీ క్లోరైడ్‌ రెండు గ్రాములు లీటరు నీటికి, లేదా ప్లాంటు మైసనోగ్రామ్‌ లీటరు నీటికి కలిపి చేనంతా తడిచేలా పిచికారీ చేయాలన్నారు. వరి దుబ్బుకు రెండు కన్నా ఎక్కువగా ఉల్లికోడు ఉన్నట్లయితే నివారణ చర్యలు చేపట్టుకోవాలన్నారు. పెప్రోనిల్‌ 2 ఎంఎల్‌ లీటరు నీటికి లేదా క్లోరీఫైరిపాస్‌ 2.5 ఎంఎల్‌ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. ముదురునారు నాటడం వల్ల ఉల్లికోడు ఎక్కువగా ఆశించే అవకాశం ఉందన్నారు. దీని నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లీటరు నీటికి లేదా డైకో ఫాలో 5 ఎంఎల్‌ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలన్నారు.

ముదినేపల్లి రూరల్‌: ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యంపై ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం ముదినేపల్లికి చెందిన బొర్రా కుసుమ భర్త పున్నారావు రెండేళ్ల క్రితం మరణించాడు. కుసుమ అప్పటి నుంచి ముదినేపల్లిలో తండ్రి ఇంటి వద్దే ఉంటోంది. కుసుమకు ఇద్దరు పిల్లలు. ఈ నెల 11న డ్వాక్రా గ్రూపు వాయిదా చెల్లించేందుకు మచిలీపట్నంలోని అత్తగారింటికి వెళ్లింది. అదే రోజు తిరిగి సాయంత్రం ముదినేపల్లి వచ్చింది. ఇద్దరు కుమారులు పాఠశాల నుంచి రాగానే తమ బంధువులకు యాక్సిడెంట్‌ జరిగిందని పొరుగూరు వెళ్తున్నానని, తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పాలని పొరుగింట్లో చెప్పి పిల్లలతో సహా వెళ్లిపోయింది. తండ్రి బంధువులను ఆరా తీయగా ఎవరూ ఆచూకీ తెలపకపోవడంతో స్టేషన్‌ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): ప్రస్తుత ఖరీఫ్‌లో రైతుల నుంచి ధాన్యం సేకరణకు లక్ష్యాలను నిర్దేశించినట్టు జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కాకినాడలో శుక్రవారం ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల అధికారుల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఈ విషయం వెల్లడించారని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలో 5 లక్షలు, ఏలూరు జిల్లాలో 4 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యమన్నారు. కేంద్రం వరి సాధారణ రకాలకు రూ.2369, ఏ గ్రేడ్‌ రకాలకు రూ.2389 మద్దతు ధరల ప్రకటించిందని చెప్పారు.

పాలకొల్లు సెంట్రల్‌: క్షీరారామలింగేశ్వరస్వామి దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు నియామకపు ఉత్తర్వులు శుక్రవారం వెలువడ్డాయి. సభ్యులుగా మీసాల రామచంద్రరావు, ఉప్పలపు పెద్దిరాజు, నాళం వెంకట సురేఖ, పినిశెట్టి శ్రీనివాస్‌, కొండ్రెడ్డి సూర్యనారాయణ, పెన్మత్స శ్రీదేవి, బాసిన సత్యనారాయణ, వాండ్రపు కుమారి, నీలాపు సింహాచలం, నీలాపు మణి సభ్యులుగా ఎన్నికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement