
డ్రోన్ల వినియోగంపై శిక్షణ
వ్యవసాయ రంగంలో ఇటీవల డ్రోన్ల వినియోగం పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం ద్వారా డ్రోన్ల వినియోగంపై శిక్షణకు శ్రీకారం చుట్టారు. 8లో u
అలక్ష్యానికి తావు లేదు
ఏలూరు(మెట్రో): గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో వరద ప్రభావిత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు యుద్ధప్రాతిపదికపై తరలించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారు లను ఆదేశించారు. గోదావరి వరద ఉధృతి నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం సాయంత్రం సంబంధింత అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి ప్రమాద హెచ్చరిక ముంపు ప్రాంతాలైన కుక్కునూరు మండలం లచ్చిగూడెం, గొమ్ముగూడెం ప్రజలను తక్షణమే దాచారం ఆర్ అండ్ ఆర్ కాలనీకి తరలించాలన్నారు. రెండో ప్రమాద హెచ్చరిక ప్రభావితమయ్యే ముంపు గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేయాలన్నారు. గర్భిణులు, వయోవృద్ధులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారిని సమీప సీహెచ్‌సీలకు తరలించాలన్నారు. అవసరమైన టార్పాలిన్లు, బోట్లు, లైఫ్ జాకెట్లు, గజ ఈతగాళ్లను, రోప్ పార్టీలు అందుబాటులో ఉంచాలన్నారు. పునరా వాస కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాస్థాయిలో 1800 233 1077 నెంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 833 390 5022, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఆఫీసు 83092 69056, కుక్కునూరు తహసీల్దారు కార్యాలయం 83092 46369, వేలేరుపాడు తహసీల్దారు కార్యాలయంలో 83286 96546 నెంబర్లతో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం డివిజన్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు ఈపీడీసీఎల్ ఎస్‌ఈ పీ.సాల్మన్ రాజు తెలిపారు. ఏలూరులో 9440902926 నెంబర్‌తో, జంగారెడ్డిగూడెంలో 9491030712 నెంబర్‌తో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామన్నారు.