
మాజీ ఎమ్మెల్యే దృష్టికి కొల్లేరు సమస్యలు
దెందులూరు: కొల్లేరులోని పలు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరికి వడ్డీల కార్పొరేషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ ముంగర సంజీవ్‌కుమార్, కొల్లేరు నాయకులు తెలియజేశారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కార్యాలయంలో కొల్లేరు నాయకులు ఆయన్ను కలిశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల్లో వివక్ష, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై వేధింపులు, అక్రమ కేసులను అబ్బయ్యచౌదరి దృష్టికి తీసుకువచ్చారు. పార్టీ శ్రేణులతో పాటు ప్రజలందరికీ వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని అబ్బయ్యచౌదరి భరోసా ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు తేరా ఆనంద్, కార్పొరేషన్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ ప్రభాకర్ రావు, మాదేపల్లి సర్పంచ్ కొరపాటి ప్రభుదేవా, పార్టీ జిల్లా కార్యదర్శి ప్రేమ్‌బాబు, కొల్లేరు నాయకులు ఉన్నారు.