
కాలువలోకి దూసుకెళ్లిన టూరిస్టు బస్సు
పెదకాకాని: ప్రయాణికులతో వస్తున్న బస్సు కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదం తృటిలో తప్పింది. తణుకు నుంచి అరుణాచలం తీర్థయాత్రకు 39 మంది ప్రయాణికులతో టూరిస్టు బస్సు బయలు దేరింది. వారు శుక్రవారం రాత్రి పెదకాకాని మండలం నంబూరు అరబిక్ స్కూల్ సమీపంలోకి చేరుకునే సరికి డ్రైవర్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. బస్సు అదుపుతప్పి జాతీయ రహదారి పక్కనే ఉన్న కల్వర్టు వంతెనపైకి ఎక్కి ఆగింది. ప్రయాణికులంతా భయంతో కేకలు వేశారు. పలు వురి స్వల్ప గాయాలయ్యాయి. సంఘటనా స్థలా నికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు.