
గ్యాస్ నొప్పితో మహిళ మృతి
చాట్రాయి: గ్యాస్ నొప్పితో ఓ మహిళ మృతి చెందింది. పోతనపల్లికి చెందిన వడిత్యా కామాక్షి (35) బధవారం గ్యాస్ నొప్పిగా ఉందని భర్తతో కలిసి చాట్రాయి ఆర్‌ఎంపీ వైద్యులను ఆశ్రయించారు. టిఫిన్ చేసి రావాలని ఆర్‌ఎంపీ వైద్యుడు సూచించారు. అనంతరం టిఫిన్ చేసి వచ్చిన తరువాత బీపీ చూస్తుండగా ఆమె అకస్మాత్తుగా వాంతులు చేసుకుని స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే పీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు పీహెచ్‌సీ వైద్యురాలు విజయలక్ష్మి చెప్పారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆమె మృతితో భర్త, పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు. విజయలక్ష్మి భౌతికకాయాన్ని దేశిరెడ్డి రాఘవరెడ్డి, వైఎస్సార్ సీపీ నేత కారంగుల వాసు సందర్శించి నివాళులర్పించారు.