
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
పెనుమంట్ర: నవుడూరు– పొలమూరు గ్రామాల మధ్య ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పాలమూరుకు చెందిన కడలి నాగార్జున (33) మృతి చెందాడు. మోటార్ సైకిల్‌పై భీమవరం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని స్థానికులు చెబుతున్నారు. రోడ్డుపై గాయాలతో పడి ఉన్న నాగార్జునను 108 లో తణుకు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు పైలట్ బాలకృష్ణ తెలిపారు. నాగార్జున ఇటీవల దుబాయ్ నుంచి వచ్చాడని, అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, అతని బంధువులు తెలిపారు.