పెదవేగి: పెదవేగి ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు రావలసిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఏలేశ్వరం, కిర్లంపూడి, ప్రత్తిపాడు పామాయిల్ గెలలను కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పే విధానాన్ని విరమించుకోవాలని కోరుతూ ఫ్యాక్టరీ వద్ద ధర్నా చేపట్టారు. శనివారం పెదవేగిలో జరిగిన ధర్నా కార్యక్రమంలో ఐఎఫ్‌టీయు ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ ఆ మూడు మండలాల నుంచి పామాయిల్ గెలలు వస్తే పెదవేగి యూనిట్‌కు మనుగడ ఉంటుందని అన్నారు. పామాయిల్ తోటలను ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పితే ఉద్యోగ కార్మికుల మనుగడకు పెను ప్రమాదం పొంచి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో కార్మిక కర్షక ఐక్య ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని హెచ్చరించారు. దీనికి సంబంఽధించిన వినతిపత్రాన్ని సీనియర్ మేనేజర్ సుధాకర్‌కి అందజేశారు. కార్యక్రమంలో ముక్కు సుబ్బారావు, మానికొండ ప్రసాద్, సంపంగి ప్రసాద్, తాతా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.