గురుకుల పాఠశాలలో విజిలెన్స్‌ తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

గురుకుల పాఠశాలలో విజిలెన్స్‌ తనిఖీలు

Jun 22 2025 3:44 AM | Updated on Jun 25 2025 12:18 PM

ద్వారకాతిరుమల: స్థానిక డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలలో శనివారం జిల్లా విజిలెన్స్‌ కమిటీ సభ్యుడు డాక్టర్‌ వంటిపల్లి విజయకృష్ణ తనిఖీ చేశారు. గురుకులంలో ఉంటున్న పాఠశాల, జూనియర్‌ కళాశాల విద్యార్థినుల సంఖ్య తదితర వివరాలను ప్రిన్సిపాల్‌, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డులను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథక అమలు తీరును స్వయంగా పరిశీలించారు. మధ్యాహ్న భోజనం అమలులో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే తన దృష్టికి తేవాలని విద్యార్థినులకు సూచించారు. అన్ని వివరాలతో కూడిన నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందిస్తానని ఆయన తెలిపారు.

అంజన్నకు అభిషేకం

జంగారెడ్డిగూడెం: మండలంలోని గుర్వాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయస్వామి వారి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే అభిషేక సేవను ఘనంగా నిర్వహించారు. ఆలయ ముఖ మండపంపై స్వామి వారి ఉత్సవమూర్తికి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం వరకు పలు సేవలు, విరాళాల రూపంలో రూ.1,93,724 ఆదాయం ఆలయానికి సమకూరినట్లు ఈఓ ఆర్‌వీ చందన తెలిపారు.

గురుకుల పాఠశాలలో విజిలెన్స్‌ తనిఖీలు 1
1/1

గురుకుల పాఠశాలలో విజిలెన్స్‌ తనిఖీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement