
దంచి కొట్టి.. వెతలు మిగిల్చి
పెదవేగి : ధాన్యంపై బరకాలు కప్పుతూ..
జంగారెడ్డిగూడెం : లక్కవరంలో కల్లాల్లో ధాన్యంపై బరకాలు కప్పుతున్న రైతు
ఉంగుటూరు: తడిసిన ధాన్యం బస్తాలు
ఏలూరు (మెట్రో): జిల్లాలో గాలివాన బీభత్సం బెంబేలెత్తించింది. వారం రోజులుగా విభిన్న వాతావరణం జిల్లావాసులను కలవరపెడుతోంది. ఆదివారం వేకువజాము నుంచే ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులు వీచాయి. ఉదయం నుంచే పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సాయంత్రం 6 గంటల వరకు జిల్లావ్యాప్తంగా 24.7 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు అంచనా. ఏలూరుతో పాటు బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం, నూజివీడు, చింతలపూడి, కై కలూరు ప్రాంతాల్లో ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకున్నాయి. వాతావరణంలో మార్పులతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
నేలకొరిగిన చెట్లు
ఈదురుగాలులకు ఏలూరులో పలు చోట్ల వృక్షాలు నేలకొరిగాయి. ఎన్‌ఆర్ పేటలో భారీ వృక్షం నేల కూలింది. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. భీమడోలు మండలం గుండుగొలనులో చెట్లు నేలకొరిగాయి. చాట్రాయి మండలంలో వీధు లు జలమయం కాగా.. చింతలపూడిలో భారీ వర్షం కురిసింది. బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. లింగపాలెం మండలంలో ఉరుములు భయపెట్టాయి. కై కలూ రు, కై కలూరు మండలంలో తీవ్ర ఈదురుగాలులు, వర్షంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు.
విద్యుత్ సరఫరాకు అంతరాయం
కై కలూరు, లింగపాలెం, బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం, ఏలూరులోని పలు ప్రాంతాల్లో చెట్లు కూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ శాఖ అధికారులు పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నారు.
24.7 సెం.మీ వర్షపాతం
జిల్లావ్యాప్తంగా ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు సుమారు 24.7 సెం. మీ వర్షపాతం నమోదు కావచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. సోమవారం ఉదయానికి పూర్తి వివరాలు తెలుస్తామన్నారు. మండలాల వారీగా ముసునూరులో 66.4 మి.మీ, లింగపాలెంలో 55.2, ముదినేపల్లిలో 48.6, చాట్రాయిలో 46.2, మండవల్లిలో 42.2, జంగారెడ్డిగూడెంలో 38.4, పోలవరంలో 36.6, నూజివీడులో 33.2, బుట్టాయగూడెంలో 33.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఉంగుటూరులో 30.2, ఆగిరిపల్లిలో 25.6, కై కలూరులో 22.6, పెదపాడులో 17.4, కామవరపుకోటలో 16.8, జీలుగుమిల్లిలో 15, టి.నరసాపురంలో 14.8, భీమడోలులో 12.8, ఏలూరు నగరంలో 12.4, నిడమర్రులో 12.2, చింతలపూడిలో 10.4, ద్వారకాతిరుమలలో 10, వేలేరుపాడులో 9.6, పెదవేగిలో 8.6, ఏలూరు రూరల్‌లో 8.2, కుకునూరులో 8.2, కలిదిండిలో 6.2, కొయ్యలగూడెంలో 5.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
అన్నదాత.. గుండెకోత
అకాల వర్షానికి రైతులు ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. జిల్లాలో 78,317 ఎకరాల్లో వరి ప్రధాన పంటగా సాగు చేయగా 3.53 లక్షల టన్ను ల ధాన్యం ఉత్పత్తి అంచనా. ఇప్పటివరకూ 2.05 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించగా.. రైతుల వద్ద 1.40 లక్షల టన్నుల ధాన్యం ఉంది. దీనిలో సుమారు లక్ష టన్నుల ధాన్యం రైతులు ఆరబెట్టేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కురిసిన వర్షాలతో పలు ప్రాంతాల్లో ధాన్యం తడిచిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారు.
జడిపించిన వాన
జిల్లాలో గాలివాన బీభత్సం
24.7 సెం.మీ వర్షపాతం నమోదు
కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
లోతట్టు ప్రాంతాలు జలమయం
పంటను కాపాడుకునేందుకు రైతుల పాట్లు
వారం రోజులుగా భిన్న వాతావ‘రణం’
వాతావరణ మార్పులతో ఆరోగ్య సమస్యలు
ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు రావడంతో పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. వైరల్ ఫీవర్లు వస్తాయి. దగ్గు, జలుబు సమస్యలు ఎదురవుతాయి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి. వాతావరణ మార్పుల మూలంగా శరీరం రోగనిరోధక శక్తిని కోల్పోతుంది. ఈ వాతావరణానికి అనుగుణంగా ఆహారంలోనూ మార్పులు చేసుకోవాలి.
– బంకా రవికుమార్, వైద్యుడు, ఏలూరు

దంచి కొట్టి.. వెతలు మిగిల్చి

దంచి కొట్టి.. వెతలు మిగిల్చి

దంచి కొట్టి.. వెతలు మిగిల్చి

దంచి కొట్టి.. వెతలు మిగిల్చి

దంచి కొట్టి.. వెతలు మిగిల్చి

దంచి కొట్టి.. వెతలు మిగిల్చి

దంచి కొట్టి.. వెతలు మిగిల్చి

దంచి కొట్టి.. వెతలు మిగిల్చి