
ఉద్యోగ భద్రత కల్పించాలి
ఆరేళ్లుగా సీహెచ్‌ఓలుగా పనిచేస్తున్న మాకు ఉద్యోగ, ఆర్థిక భద్రత కల్పించాలి. ఏడాదిగా పెండింగ్‌లో ఉన్న ఇన్సెంటివ్‌లను విడుదల చేయాలి. తమను ప్రజలకు సేవ చేసే కోణంలోనే పాలకులు చూడాలి. అప్పుడే గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుతాయి.
– కురెళ్ల సురేంద్ర, సీహెచ్‌ఓల సంఘ చీఫ్ అడ్వయిజర్, హెచ్‌డబ్ల్యూసీ, జి.కొత్తపల్లి
చర్చలకు పిలిచేంత వరకూ..
రాష్ట్రవ్యాప్తంగా గత నెల 15 నుంచి పలు రూపాల్లో నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో గత నెల 28 నుంచి సమ్మెలోకి వెళ్లాం. సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలిచేంత వరకూ సమ్మెలోనే ఉంటాం.
– సొంగా సిద్ధయ్య,
అసోసియేషన్ అధ్యక్షుడు, హెచ్‌డబ్ల్యూసీ, తెడ్లం
నిరసనలను పట్టించుకోరా?
మా నిరసనలను పాలకులు పట్టించుకోవడం లేదు. గత నెల 24, 25 తేదీల్లో విజయవాడలో జరిగిన మహాధర్నాలో సీహెచ్‌ఓలంతా పాల్గొన్నాం. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. వేతనాల విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నాం. చివరి అస్త్రంగా సమ్మెకి దిగాం.
– ఎస్‌కే రేష్మా, హెచ్‌డబ్ల్యూసీ, కొయిదా
సర్వీసులను క్రమబద్ధీకరించాలి
ఆరేళ్లు దాటిన సీహెచ్‌ఓల సర్వీసులను క్రమబద్ధీకరించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ఎన్‌హెచ్‌ఎంలో ఇతర ఉద్యోగులతో సమానంగా 23 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలి. ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు తీర్చేలా హామీ ఇవ్వాలి. ఆయా సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి.
– గెడ్డం లావణ్య, హెచ్‌డబ్ల్యూసీ, గోపన్నపాలెం
●

ఉద్యోగ భద్రత కల్పించాలి

ఉద్యోగ భద్రత కల్పించాలి

ఉద్యోగ భద్రత కల్పించాలి