ఏలూరు (మెట్రో): ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాల్సిన ఎన్నికల ప్రచారాన్ని తప్పుదారి పట్టించి ఓడిపోతామనే భయంతో ప్రతిపక్ష పార్టీలపై భౌతిక దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని జెడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ అన్నారు. గోపాలపురం అసెంబ్లీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, హోం మంత్రి తానేటి వనితపై నల్లజర్లలో, ఏలూరు ఎంపీ అభ్యర్థి సునీల్‌కుమార్‌పై దాడులు చేయించి స్వేచ్ఛాయుతంగా జరగాల్సిన ఎన్నికల ప్రచార ప్రక్రియను టీడీపీ అపహాస్యం చేస్తోందన్నారు. టీడీపీ ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక జెండాలు జతకట్టి కూటమిగా వస్తూ ఇలాంటి దాడులు చేయడాన్ని ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. 13న జరిగే పోలింగ్‌లో ప్రజారంజక పాలన సాగిస్తున్న సీఎం జగన్ నాయకత్వంలో వైఎస్సార్‌సీపీని ఆదరించి మరోసారి పట్టం కట్టేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు.


