Sakshi News home page

అర్జీలు గడువులోగా పరిష్కరించాలి

Published Tue, Nov 21 2023 1:22 AM

వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ 
 - Sakshi

ఏలూరు(మెట్రో): అర్జీదారుల సమస్యల పట్ల సకాలంలో స్పందించి నిర్ణీత గడువులోగా సంతృప్తికర స్థాయిలో పరిష్కార మార్గాలు చూపాలని కలెక్టర్‌ వె.ప్రసన్న వెంకటేష్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం–స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ బి.లావణ్యవేణి, డీఆర్‌ఓ ఎం.వెంకటేశ్వర్లు, డీఆర్‌డీఏ పీడీ ఆర్‌.విజయరాజు, ఆర్డీవో ఎన్‌.ఎస్‌.కె. ఖాజావలి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ జీవీవీ సత్యనారాయణ హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. జగనన్నకు చెబుదాం–స్పందన కార్యక్రమంలో 316 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అర్జీలను నిర్ణీత కాలవ్యవధిలో నాణ్యతతో కూడిన విధంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అర్జీదారుడి సంతృప్తే ధ్యేయంగా పరిష్కారం ఉండాలని స్పష్టం చేశారు.

అర్జీల్లో కొన్ని..

● కుళాయి కనెక్షన్‌ సమస్యను పరిష్కరించాలని కై కలూరు మండలం ఆలపాడుకు చెందిన బండి శ్రీనివాసరావు కోరారు.

– సెక్షన్‌ 22ఎ లో నమోదైన తన భూమిని అందులో నుంచి తొలగించాలని ముసునూరు మండలం గోపవరం గ్రామానికి చెందిన అరకల రామారావు కోరారు.

– తమ ప్రాంతంలో ప్రభుత్వ వసతి గృహాన్ని మంజూరు చేయాలని ముదినేపల్లి మండలం గురజాకు చెందిన దారం చంటి కోరారు.

–తమ భూమికి చుట్టుపక్కల సరిహద్దు రైతులు సుమారు 15 సెంట్లు ఆక్రమించి గ్రావెల్‌ పోశారని ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని కామవరపుకోటకు చెందిన పరసా వెంకటశ్రీనివాసరావు కోరారు.

Advertisement
Advertisement