భీమవరం(ప్రకాశం చౌక్): పర్యాటక రంగంలో ఉత్తమ పర్యాటక ప్రాంతాల ఎంపికకు 2024 ఏడాదికి పర్యాటక మంత్రిత్వ శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎండీ.హెచ్.మెహరాజ్ ఓ ప్రకటన విడుదల చేశారు. వ్యవసాయ పర్యాటకం, బాధ్యాతాయుత పర్యాటకం, వారసత్వ పర్యాటకం, కళాఖండాలు, శక్తివంతమైన గ్రామాలు, కమ్యూనిటీ ఆధారితం, వెల్ నెస్ రంగాలకు సంబంధించిన దరఖాస్తులకు అర్హులుగా పేర్కొన్నారు. వీరు తమ దరఖాస్తులను www.rural.tourism. gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. బెస్ట్ రూరల్ టూరిజం విలేజెస్‌గా ఎంపికై న గ్రామాలకు రాష్ట్ర, జాతీయస్థాయిల్లో పురస్కారాలు అందజేస్తారని ఈ సందర్భంగా తెలిపారు. మరిన్ని వివరాలకు 98499 09082, 63099 42024 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.